6 ఎజెండాలతో కాంగ్రెస్ కొత్త కమిటీలు

ABN , First Publish Date - 2022-04-25T23:27:33+05:30 IST

కాంగ్రెస్ పార్టీ ఆరు ఎజెండాలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. వచ్చే నెల 13 నుంచి 15 వరకు ఉదయ్‌పూర్‌లో ‘నవ్ సంకల్ప్ శివిర్’ అనే పేరుతో మూడు రోజుల పాటు మేధోమధన కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా పార్టీ అధినేత సోనియాగాంధీ..

6 ఎజెండాలతో కాంగ్రెస్ కొత్త కమిటీలు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఆరు ఎజెండాలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. వచ్చే నెల 13 నుంచి 15 వరకు ఉదయ్‌పూర్‌లో ‘నవ్ సంకల్ప్ శివిర్’ అనే పేరుతో మూడు రోజుల పాటు మేధోమధన కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా పార్టీ అధినేత సోనియాగాంధీ అధ్యక్షతన సోమవారం జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో ఆరు ఎజెండాలకు సంబంధించిన ఆరు కమిటీల జాబితాను విడుదల చేశారు. ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్, యూత్ అండ్ అన్‌ఎంప్లాయిమెంట్, ఆర్గనైజేషనల్ అఫైర్స్, సోషల్ ఎన్విరాన్‌మెంట్, ఎకనామిక్ స్టేట్, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలుగా వీటికి నామకరణం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రాతినధ్యం వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కమిటీలకు మల్లిఖార్జున ఖర్గే, సల్మాన్ ఖుర్షీద్, పి.చిదంబరం, ముకుల్ వాస్నిక్, భూపిందర్ సింగ్ హూడా, అమరీందర్ సింగ్ వారింగ్‌లు కన్వీనర్లుగా వ్యవహరించనున్నారు.



Updated Date - 2022-04-25T23:27:33+05:30 IST