కొండగట్టులో రద్దీ

ABN , First Publish Date - 2021-01-27T06:05:10+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధానం మంగళవారం భక్తులతో సందడిగా మారింది. లాక్‌డౌన్‌ అనంతరం మొదటిసారిగా వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

కొండగట్టులో రద్దీ
ఆలయ ఆవరణలో భక్తులు

భక్తులతో పోటెత్తిన అంజన్న క్షేత్రం

మల్యాల, జనవరి 26: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధానం మంగళవారం భక్తులతో సందడిగా మారింది. లాక్‌డౌన్‌ అనంతరం మొదటిసారిగా వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భక్తులతో కొండంతా రద్దీగా మారింది. క్యూలైన్‌లు నిండిపోగా సీతమ్మ కన్నీటి గుంతల వరకు బారులు తీరారు. భక్తులు అంజన్నను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అభిషేక పూజలు జరిపారు. అనంతరం భేతాలుడు, శ్రీరాముల వారిని కూడా దర్శించుకున్నారు. పూజల కోసం వందలాది వాహనాలు కొండ పైకి చేరాయి. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు.

Updated Date - 2021-01-27T06:05:10+05:30 IST