కాంగ్రెస్ సీనియర్ నేత గుండెపోటుతో మృతి

ABN , First Publish Date - 2021-06-13T19:38:52+05:30 IST

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ అసెంబ్లీలో విపక్ష నేత ఇందిరా హ్రిదయేష్..

కాంగ్రెస్ సీనియర్ నేత గుండెపోటుతో మృతి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ అసెంబ్లీలో విపక్ష నేత ఇందిరా హ్రిదయేష్ ఆదివారంనాడు  ఢిల్లీలోని ఉత్తరాఖండ్ సదన్‌లో కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె కన్నుమూసినట్టు పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి దేవేందర్ యాదవ్ తెలిపారు. ఢిల్లీలో ఒక సమావేశం కోసం ఆమె వచ్చారని, గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారని చెప్పారు. 1941 ఏప్రిల్ 7న జన్మించిన హ్రిదయేష్ 2012లో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో హల్ద్వాని నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2012 నుంచి 2017 వరకూ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. హరీష్ రావత్ నేతృత్వంలో పార్లమెంటరీ వ్యవహారాలు, హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ప్లానింగ్ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.

Updated Date - 2021-06-13T19:38:52+05:30 IST