ఆర్టీసీ టెండర్లలో గందరగోళం

ABN , First Publish Date - 2021-11-27T06:24:21+05:30 IST

టీఎస్‌ ఆర్టీసీ కార్గో సర్వీసుకు మ్యాన్‌పవర్‌ కోసం ఇటీవల పిలిచిన టెండర్ల ఖరారులో గందరగోళం ఏర్పడింది.

ఆర్టీసీ టెండర్లలో గందరగోళం
వాగ్వాదానికి దిగిన టెండర్‌దారులు

కార్యాలయం వద్ద పలువురి ఆందోళన

నల్లగొండ అర్బన్‌, నవంబరు 26: టీఎస్‌ ఆర్టీసీ కార్గో సర్వీసుకు మ్యాన్‌పవర్‌ కోసం ఇటీవల పిలిచిన టెండర్ల ఖరారులో గందరగోళం ఏర్పడింది. టెండర్లను డీవీఎం కార్యాలయంలో శుక్రవారం తెరవగా, ఆర్టీసీ అధికారులు వారి సంబంధికులకు అనుకూలంగా వ్యవహరించారని పలువురు టెండర్‌దారులు ఆందోళన వ్యక్తం నిర్వహించారు. టెండర్లలో 20 వరకు ఏజెన్సీలు పాల్గొనగా, అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. డీడీ మీద రెండు సంతకాలు లేవని కారణం చూపుతూ భువనగిరికి చెందిన ఓ టెండరుదారుడి తప్పించారని, ఇది అన్యాయని అన్నారు. ఏ మాత్రం అనుభవం లేని, నిబంధనలు పాటించని వారికి కాంట్రాక్టు కేటాయించారని ఆరోపించారు. టెండర్లను మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. 

Updated Date - 2021-11-27T06:24:21+05:30 IST