కన్ఫ్యూజన్‌లో ఎన్నారైలు.. కేంద్రం కొత్త ప్రకటనతో లబోదిబో..

ABN , First Publish Date - 2021-11-19T04:49:28+05:30 IST

వీసాల విషయంలో కేంద్రం చేసిన కొన్నిమార్పులు చేర్పులు వారిని కన్ఫ్యూజన్‌లోకి నెట్టేశాయి. గతంలో జారీ చేసిన మల్టీ ఎంట్రీ వీసాలు చెల్లవనని కేంద్రం పేర్కొనడంతో వారికి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టైంది.

కన్ఫ్యూజన్‌లో ఎన్నారైలు.. కేంద్రం కొత్త ప్రకటనతో లబోదిబో..

ఇంటర్నెట్ డెస్క్: దాదాపు రెండు సంవత్సరాల తరువాత కరోనా ఆంక్షలకు స్వస్తి పలికిన భారత ప్రభుత్వం.. విదేశీ ప్రయాణికులను దేశంలోకి అనుమతిస్తామని ఇటీవలే ప్రకటించింది. ఈ ప్రకటన అనేక మంది ప్రవాసీ భారతీయులకు ఎంతో సంతోషం కలిగించింది. ఇంతకాలం భారత్‌లోని తమ వారిని చూడలేకపోయిన వారందరూ ఎప్పుడెప్పుడు భారత్‌కు ప్రయాణం కడదామా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే..వీసాల విషయంలో కేంద్రం చేసిన కొన్నిమార్పులు చేర్పులు వారిని కన్ఫ్యూజన్‌లోకి నెట్టేశాయి. గతంలో జారీ చేసిన మల్టీ ఎంట్రీ వీసాలు చెల్లవనని కేంద్రం పేర్కొనడంతో వారికి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టైంది.


 ఈ క్రమంలో.. చక్రాల కుర్చీకే పరిమితమైన ఓ మహిళ  భారత్‌కు వచ్చేందుకు ఇటీవల అమెరికాలోని ఓ ఎయిర్‌పోర్టుకు రాగా.. అధికారులు ఆమెను విమానంలోకి అనుమతించలేదు. ఆమె వీసా రద్దైందని చెప్పుకొచ్చారు. కేంద్రం నిర్ణయం ఆమెకు తెలియకపోవడంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. 2019లో ఆమెకు వీసా జారీ అయింది. అది 2029 వరకూ చెల్లుబాటవ్వాల్సి ఉన్నా.. కేంద్రం తాజా నిర్ణయంతో ఆమె ఊహించని పరిణామాన్ని ఎదుర్కొంది. ఇటువంటి వీసాలు ఉన్న అనేక మంది ఎన్నారైలు తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కొత్త వీసాలకు దరఖాస్తు చేసుకోవడం తమకు భారం అవుతుందని, గతంలో జారీ చేసిన మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసాలను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

Updated Date - 2021-11-19T04:49:28+05:30 IST