మంగళకుంట వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

ABN , First Publish Date - 2022-05-18T06:46:27+05:30 IST

మండలంలోని మంగళకుంట గ్రామంలో మంగళవారం ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార వైసీపీలో వర్గపోరు బహిర్గతమైంది.

మంగళకుంట వైసీపీలో భగ్గుమన్న విభేదాలు
మాట్లాడుతున్న కుందురు నాగార్జునరెడ్డి

తర్లుపాడు, మే 17: మండలంలోని మంగళకుంట గ్రామంలో మంగళవారం ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార వైసీపీలో వర్గపోరు బహిర్గతమైంది. ఆది పత్యం కోసం నాయకులు రెండుగా విడి పోయారు. రెండు వర్గాల వారు విడివిడిగా తమ నివాసాల వద్ద టెంట్లు ఏర్పాటు చేసి కార్యకర్తలకు భోజనాలు కూడా ఏర్పాటు చేసు కున్నారు. మధ్యాహ్నం మార్కాపురం శాసన సభ్యులు కుందురు నాగార్జునరెడ్డి మంగళ కుంట గ్రామానికి వచ్చారు. ముందుగా సర్పం చ్‌ పిన్నిక శారద ఇంటి వద్దకు అధికారులతో కలసి వెళ్లారు. ఇది సహించని మాజీ సర్పంచ్‌ గురుమూర్తి కుమారుడు ప్రసాద్‌ తన అనుచరులతో ఇంటి వద్ద ఏర్పాటు చేసిన శిబిరానికి వెళ్లి పోయాడు. దీంతో ఎమ్మెల్యే స్వయంగా ప్రసాద్‌ ఇంటి వద్దకు వెళ్లి సుమారు గంట పాటు బుజ్జగించేందుకు ప్రయత్నిం చాడు. అయినప్పటికీ, కార్యక్రమానికి వచ్చేది లేదంటూ ఆయన వర్గీయులు భీష్మించుకు కూర్చున్నారు. ఇరువర్గాలకు తగిన న్యాయం చేస్తానని ప్రసాద్‌తో ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన ఇంటిలో రహస్యంగా బుజ్జగించే ప్రయత్నం చేశారు. అనంతరం కార్యక్రమానికి ఎమ్మె ల్యే తన వెంట తీసుకెళ్లారు. 

సమస్యలు ఏకరువు

మంగళకుంటలో ఎమ్మె ల్యేకు    ప్రజలు పెద్ద ఎత్తున తమ సమస్యలు ఏకరువు పెట్టారు. గ్రామంలో ఎమ్మెల్యే గడపగడపకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత  నాలుగు సంవత్సరాల నుంచి తాడివారిపల్లె నుంచి మంగళకుంటకు తారు రోడ్డుకు మోక్షం కలగలేదని సచివాలయానికి వెళ్లాలంటే 5  కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోందని వాపోయారు. గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు ఒక పూటే వెళ్లేలా వీలు కల్పించాలని ఎమ్మెల్యే ముందు మొరపెట్టుకున్నారు. నాతనంపల్లెలో ట్రాన్స్‌ఫార్మర్‌ లేకపోవడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగు తోందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. గ్రామానికి కనీసం బస్సు సౌకర్యం కూడా లేకపోవడంతో విద్యార్థులకు పాఠశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. పింఛన్లు, పక్కా గృహాలు, రేషన్‌ కార్డులు మంజూరు చేయాలని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.  ప్రజా సమస్యలు పరిష్కరిస్తాననిఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ పిన్నిక శారద, ఎంపిపి సూరెడ్డి భూలక్ష్మీ, తహ సీల్దార్‌ బి.శ్రీనివాస్‌, ఎంపీడీవో ఎస్‌.నరసిం హులు, వెలుగు ఏపీఎం డి.పిచ్చయ్య పలు శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది పలువురు నాయకులు పాల్గొన్నారు.

జగనన్న ఇళ్లు  వేగంగా నిర్మించుకోవాలి

మార్కాపురం, మే 17: జగనన్న ఇళ్లు త్వరిత గతిన నిర్మించుకోవాలని ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఇడుపూరుకు సంబంధించి నూతనంగా మంజూరైన 10 మంది లబ్ధిదారులకు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో పట్టాలను మంజూరు చేశారు. 

Updated Date - 2022-05-18T06:46:27+05:30 IST