తమ్ముడితో అన్న ఘర్షణ

ABN , First Publish Date - 2021-07-25T05:39:07+05:30 IST

తమ్ముడితో అన్న ఘర్షణ పడ్డాడు. అడ్డుకోబో యిన హోంగార్డుపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన దేవరకొండ పట్టణంలోని సంజయ్‌కాలనీలో శనివారం జరిగింది.

తమ్ముడితో అన్న ఘర్షణ

అడ్డుకోబోయిన హోంగార్డుపై కత్తితో దాడి 

దేవరకొండ, జూలై 24: తమ్ముడితో అన్న ఘర్షణ పడ్డాడు. అడ్డుకోబో యిన హోంగార్డుపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన దేవరకొండ పట్టణంలోని సంజయ్‌కాలనీలో శనివారం జరిగింది. ఎస్‌ఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన అన్నెపు హరికృష్ణ కూలీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యం మత్తులో తమ్ముడు రాజుతో శనివారం గొడవ పడ్డాడు. ఒక చేతిలో కత్తి, మరో చేతిలో స్ర్కూడ్రైవర్‌తో బెదిరించాడు. రాజు కేకలు వేయడంతో స్థానికులు 100నెంబర్‌కు ఫోన్‌ చేశారు. అప్పటికే కౌన్సిలర్‌ రైసొద్దిన్‌ అక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపటికి కానిస్టేబుల్‌ శివ, హోంగార్డు చిన్ననాయక్‌ కూడా అక్కడికి వచ్చారు. హరికృష్ణను అడ్డుకునేం దుకు యత్నించారు.  మత్తులో ఉన్న హరికృష్ణ తమ్ముడిని వదిలేసి కౌన్సి లర్‌, కానిస్టేబుల్‌, హోంగార్డులపై కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు. దీంతో హోంగార్డు చిన్నానాయక్‌ గొంతుకు కత్తి  తగిలింది. వెంటనే హోంగార్డును ఆస్పత్రికి తరలించారు. పోలీసులు హరికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-07-25T05:39:07+05:30 IST