Abn logo
Dec 3 2020 @ 10:25AM

అనంతపురంలో కార్మికుల మధ్య ఘర్షణ..ఒకరు మృతి

అనంతపురం: తూముకుంటలోని పారిశ్రామికవాడలో కార్మికుల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘటన అనంతపురంలోని రత్న ప్లాస్టిక్ పరిశ్రమలో చోటు చేసుకుంది. కార్మికులు పర్సపరం కత్తులతో దాడి చేసుకోవడంతో..కార్మికుడు రత్నాకర్ జినా మృతిచెందాడు. వెంటనే అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దాడి చేసిన కార్మికుడిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‎కు తరలించారు. దాడి చేసుకున్న కార్మికులు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement