Advertisement
Advertisement
Abn logo
Advertisement

పొలంగట్టు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

నల్గొండ: జిల్లాలో పొలం గట్టు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చందంపేట మండలం వెల్మగూడెంలో ఇటీవల పొలంగట్టు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ముర్పునూతల గ్రామానికి చెందిన యాదవులకి చెందిన భూమిని ఇతర కులానికి చెందిన కొంతమంది అక్రమించుకొని దాడి, హత్యాయత్నం చేశారు. ఈ దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి.  తమకు పోలీసులు న్యాయం చేయడం లేదని యాదవులు ఆరోపిస్తున్నారు. దాడి సమయంలో తీసిన వీడియోలు వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పరస్పర ఫిర్యాదులతో ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 

Advertisement
Advertisement