Abn logo
Jul 6 2021 @ 22:29PM

గుట్కా ప్యాకెట్లు పట్టివేత

అనంతపురం: అక్రమంగా తరలిస్తున్న గుట్కాప్యాకెట్లను భారీ మొత్తంలో పోలీసులు పట్టుకున్నారు. బళ్లారిలో వాహనాల తనిఖీలను పోలీసులు చేపట్టారు. ఈ తనిఖీలలో గుట్కా ప్యాకెట్లను స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. బళ్లారి నుంచి ప్రకాశం జిల్లాకు ఇచర్ వాహనంలో రవాణా చేస్తున్నారు. వాహనాలను వదిలిపెట్టి నిందితులు పరారయ్యారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు.