గత 12 గంటల్లో భారత్‌లో ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే...

ABN , First Publish Date - 2020-04-05T15:35:59+05:30 IST

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత 12 గంటల్లో భారత్‌లో...

గత 12 గంటల్లో భారత్‌లో ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే...

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత 12 గంటల్లో భారత్‌లో 302 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో.. భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3374కు చేరింది. ఇదిలా ఉంటే, కరోనా బారిన పడి భారత్‌లో 77 మంది మరణించారు. 267 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.


ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 12 లక్షల మందికి కరోనా సోకింది. 64,600 మందికి పైగా మరణించారు. తొలుత చైనాలో కరోనా తీవ్ర ప్రభావం చూపినప్పటికీ ప్రస్తుత పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. అమెరికా, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. 181 దేశాల్లో కరోనా ప్రభావం చూపుతోంది. భారత్‌లో లాక్‌డౌన్ 12వ రోజుకు చేరింది.

Updated Date - 2020-04-05T15:35:59+05:30 IST