జ్వరాల సర్వే పక్కాగా నిర్వహించండి

ABN , First Publish Date - 2021-05-13T05:22:32+05:30 IST

జ్వరాల సర్వే పక్కాగా నిర్వహించండి

జ్వరాల సర్వే పక్కాగా నిర్వహించండి

సబ్‌కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌ 

కవిటి: కరోనా తీవ్రత దృష్ట్యా క్షేత్రస్థాయిలో జ్వరాల సర్వే పక్కాగా నిర్వహించాలని టెక్కలి సబ్‌కలెక్టర్‌ గనోర్‌ సూరజ్‌ ధనుం జయ్‌ తెలిపారు. బుధవారం కవిటి తహసీ ల్దార్‌ కార్యాలయంలో వైద్యులు, ఏఎన్‌ఎంలతో సమీక్షించారు.  ఈసందర్భంగా  మాట్లా డుతూ జ్వరాలతో ఉన్న వారికి కొవిడ్‌ పరీక్షలు తప్పనిసరిగా నిర్వ హించాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్‌ ఆర్‌.అప్పల రాజు, ఎంపీడీవో రామారావు, డీటీ రామచంద్రరావు, ఈవోపీఆర్డీ శివాజీ పాణిగ్రాహి పాల్గొన్నారు.  సోంపేట: కొవిడ్‌పై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సబ్‌కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ  కోరారు.  బుధవారం సోంపేట సీహెచ్‌సీని పరిశీలించారు. ఈసందర్భంగా రెండోడోసు వ్యాక్సిన్‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్ర మంలో తహసీల్దార్‌ గురుప్రసాద్‌, ఎంపీడీవో సీహెచ్‌ శ్రీనివాసరావు  పాల్గొన్నారు. 


సిబ్బంది అలసత్వంపై ఆర్డీవో ఆగ్రహం

పొందూరు: కొవిడ్‌ పరీక్షల నిర్వహణలో సిబ్బంది అలసత్వం ప్రదర్శించడంపై  శ్రీకాకుళం ఆర్డీవో ఐ.కిశోర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పొందూరులో పంచాయతీకార్యదర్శులు, వీఆర్వోలు, ఏఎన్‌ఎంలు, మహిళా పోలీసులతో కొవిడ్‌ ని యంత్రణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిసచివాలయం పరిధిలో కనీసం పది మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను గుర్తించి  తక్షణమే పరీక్షలు చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యదర్శి, వీఆర్వో, ఏఎన్‌ఎం, మహిళా పోలీసుతో కూడిన కోర్‌ కమిటీకి కనీసం నలుగురు వలంటీర్లను అందించి కొవిడ్‌ నియం త్రణకు చర్యలు చేపట్టాలని ఎంపీడీవో మురళీకృష్ణను సూచించారు. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రక టించాలని ఈవో, అనూరాధ, అధికారులకు ఆదేశించారు. ఇచ్ఛాపురం: ప్రజల ఆరోగ్యం కోసం పోలీసులు ప్రాణాలను కూడా లెక్కచేయకుండా సేవలందిస్తున్నారని, బాధ్యతగా గుర్తించి ప్రతిఒక్క రూ సహకరించాలని  సీఐ ఎం.వినోద్‌బాబు కోరారు. ఇచ్ఛాపు రంలోని పాతబస్టాండ్‌ జంక్షన్‌లో ప్లకార్డులతో  పాదచారులు, వాహనచోదకులకు కరోనాపై అవగాహన కల్పించారు.  కార్యక్రమంలో పట్టణ ఎస్‌ఐ సత్యన్నారాయణ, ఏఎస్సై సింహాచలం   పాల్గొన్నారు.  రణస్థలం: మండలంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయని,  ఎవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని తహసీల్దార్‌ ఎం.సుధారాణి తెలిపారు. మండలంలో బుధవారం  106 కేసులు నమోదయ్యాయన్నారు. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.

Updated Date - 2021-05-13T05:22:32+05:30 IST