బాధిత కుటుంబాలకు అండగా ఉంటా

ABN , First Publish Date - 2022-05-17T04:48:39+05:30 IST

అకాల వర్షంతో నష్టపోయిన బాధితకుటుంబాలకు అండగా ఉంటానని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సీ లక్ష్మారెడ్డి అన్నారు.

బాధిత కుటుంబాలకు అండగా ఉంటా
నేలకు ఒరిగిన వరి పైరును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

- జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

- పెద్దరేవల్లిలో వర్షానికి దెబ్బతిన్న ఇళ్లు, పంటలు పరిశీలన 

బాలానగర్‌, మే 16: అకాల వర్షంతో నష్టపోయిన బాధితకుటుంబాలకు అండగా ఉంటానని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సీ లక్ష్మారెడ్డి అన్నారు. వర్షం కారణంగా నష్టపోయిన ఆదివారం రాత్రి మండలంలోని పెద్దరేవల్లిలో కురి సిన వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న ఇళ్లను, గుడిసెలను, కూలిన చెట్లను, స్తంభాలను ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా 14కుటుంబాలకు తక్షణ సాయం కింద కుటుంబానికి రూ. 10వేల ఆర్థిక సాయం అందజేశారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ నష్టపోయిన కు టుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని, దెబ్బతిన్న ఇళ్లవారికి  డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు  మంజూరు చేయించి పక్క ఇళ్లు కట్టిస్తామని అన్నారు. అలాగే  పొలాల్లో నేలకు ఒరిగిన వరిని  పరిశీలించారు. రైతులను పరామ ర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతకు ముందు రైతు భవనం వద్ద తడిసిన  ధాన్యాన్ని పరిశీలించారు. రైతు నుం చి వెంటనే కొనుగోలు చేసి రైస్‌ మిల్లులకు తరలించాలని వ్యవసాయ అధి కారులను ఆదేశించారు. తహసీల్దార్‌ శ్రీనువాస్‌కు ఆస్తినష్టం వివరాలను సేకరించి ప్రతిపాదనలను తయారు చేయాలని తెలిపారు. నేలకు ఒరిగిన స్తంభాలను పునరుద్దరించాలని విద్యుత్‌ శాఖ అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ కమల, గిరిజన కార్పొరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ వా ల్యానాయక్‌, వైస్‌ ఎంపీపీ వెంకటాచారి, నాయకులు గోపాల్‌రెడ్డి, శ్రీని వాసరావు, జగన్‌నాయక్‌, లింగారెడ్డి,  అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T04:48:39+05:30 IST