రాయితీలు పునరుద్ధరించాలి

ABN , First Publish Date - 2020-10-27T05:40:27+05:30 IST

కరోనాతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. జనానికి పనులులేవు, ఆదాయంలేదు. రేట్లు అందుకోలేనంతగా పెరిగిపోయాయి...

రాయితీలు పునరుద్ధరించాలి

కరోనాతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. జనానికి పనులులేవు, ఆదాయంలేదు. రేట్లు అందుకోలేనంతగా పెరిగిపోయాయి. కూరగాయలు రెండు మూడురెట్లు పెరిగాయి. కేంద్రప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ ఊసెత్తడం లేదు. గ్యాస్ ధరలు తగ్గించాల్సిన రాష్ట్రప్రభుత్వం పదిశాతం టాక్స్ పెంచింది. కరెంటు చార్జీలు పెంచింది. కరోనాకాలంలో బస్సులలో సీట్లు తగ్గించినందుకు అంటూ సీనియర్ సిటిజెన్స్, ఇతర రాయితీలు తొలగించారు. ఇప్పుడు బస్సులలో అన్ని సీట్లలోనూ కూర్చుంటున్నారు. కనుక రాయితీలన్నింటినీ పునరుద్ధరించవలసిన అవసరమెంతైనావుంది. వృద్ధులకు ఇంతకుముందులాగా రాయితీలు కల్పించండి.  


మొన్నవానలకు రోడ్లన్నీ గుంతలుపడిపోయాయి. ముందు ఆ రోడ్లను బాగుచెయ్యండి. 45 మంది ప్రభుత్వ సలహాదారులను నియమించుకొని వారికి లక్షలకొద్దీ జీతాలు, వాహనాలు ఇచ్చి కోట్లాదిగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. ముందు దాన్ని ఆపండి.

నార్నె వెంకట సుబ్బయ్య

ఒంగోలు


Updated Date - 2020-10-27T05:40:27+05:30 IST