Abn logo
Jul 31 2021 @ 03:50AM

ఆ కమిటీలకు ప్రామాణికం లేదు

591వ రోజుకు  అమరావతి రైతుల ఆందోళనలు 


తుళ్లూరు, జూలై 30 : బోగస్‌ కమిటీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా మూడు రాజధానులు చేస్తున్నామని చెప్పటం సిగ్గుచేటుగా ఉందిన రాజధానికి భూములు ఇచ్చిన రైతులు పేర్కొన్నారు. హైపవర్‌ కమిటీ, జీఎన్‌రావు కమిటీలంటూ నాటకం ఆడి మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారన్నారు. అసలు ఆ కమిటీలకు ప్రామాణికం లేదన్నారు.  నిపుణులైన వారు కమిటీలలో లేరన్నారు. అవి ఇచ్చే నివేదకను ఆధారంగా చేసుకొని మూడు రాజధానులు పెడుతున్నామమని, అమరావతి ముంపు ప్రాంతం అని ప్రచారం చేయటం దారుణమన్నారు. ఎంత అణచి వేయాలని చూసినా..  రాజధాని అమరావతి అంతకంత ఎత్తుకు ఎదుగుతుందని రైతులు పేర్కొన్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధి కొనసాగాలని రైతులు చేస్తున్న ఉద్యమం శుక్రవారం 591వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ  ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే రాజధాని అమరావతి ఏర్పడాలన్నారు.  కాగా, రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని పెదపరిమి, తుళ్లూరు, ఐనవోలు, మందడం, వెలగపూడి, దొండపాడు, నెక ్కల్లు, అనంతవరం, ఉద్దండ్రాయునిపాలెం, వెలగపూడి  తదితర రాజధాని గ్రామాలలోని రైతు శిబిరాలలో   ఆందోళనలు కొనసాగుతున్నాయి.  అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది.