Abn logo
Aug 6 2021 @ 19:34PM

అలీషా హత్య కేసులో సీఐని అరెస్ట్ చేయాలని ఆందోళన

గుంటూరు : అలీషా హత్య కేసులో సీఐ కొండారెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అలీషా మృతదేహంతో దాచేపల్లిలోని  హైవేపై అలీషా కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేశారు. దీంతో అద్దంకి, నార్కట్‌పల్లి హైవేపై భారీగి ట్రాఫిక్ స్తంభించింది. సీఐ కొండారెడ్డిని అరెస్ట్ చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

 


 గుంటూరు జిల్లా భట్రుపాలెంలో పక్కరాష్ట్రం నుంచి మ‌ద్యం త‌ర‌లిస్తున్నార‌నే నెపంతో అలీషాని పోలీసులు కొట్టి చంపారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

  దాచేపల్లి ఎక్సైజ్ పోలీసుల దాడి కేసులో మరో విషాదం చోటుచేసుకుంది. మిరియాల శ్రీకాంత్ గుండెపోటుతో మృతి చెందాడు. గత రాత్రి మిరియాల శ్రీకాంత్‌ను ఎక్సైజ్ పోలీసులు జైలుకు పంపారు. నిన్న భట్రుపాలెం వద్ద యువకులపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన షేక్‌ అలీభాషా మృతి చెందాడు. మరో ముగ్గురు యువకులపై హత్యయత్నం కేసు నమోదు చేసి పోలీసులు జైలుకు పంపారు. 


పూర్తి వివరాలు...


తమ వద్ద మద్యం లేదని మొత్తుకున్నా వినకుండా నడిరోడ్డుపై ఇద్దరు యువకుల్ని చితకబాది ఒకరి ఆత్మహత్యకు ఎక్సైజ్‌ సిబ్బంది కారకులుగా మారారు. ఈ ఘటన గురువారం భట్రుపాలెం గ్రామంలో జరిగింది. దాచేపల్లికి చెందిన షేక్‌ అలిభాషా, శ్రీకాంత్‌ అనే యువకులు భట్రుపాలెం నుంచి కారులో మద్యం తెస్తున్నారన్న సమాచారంతో ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. భట్రుపాలెం వద్ద వారిని అడ్డుకున్న సిబ్బంది మద్యం ఎక్కడ ఉందో చెప్పాలని ప్రశ్నించారు. ఈ క్రమంలో మద్యం తమ వద్ద లేదని చెప్పినా వినకుండా ఎక్సైజ్‌ సిబ్బంది తీవ్రంగా గాయపరిచారని అలీబాషా అనే యుకుడు మనస్థాపంతో పురుగుమందు తాగాడు. భట్రుపాలెం గ్రామంలో అలీబాషా పురుగుల మందు తాగాడన్న సమాచారంతో కుటుంబసభ్యులు, స్నేహితులు అక్కడికి చేరుకుని ఎక్సైజ్‌ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


మద్యం లభించకపోగా, దాడి చేయటమేమిటంటూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఎస్‌ఐ రహంతుల్లా పురుగుమందు తాగిన యువకుడ్ని గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. కుటుంబసభ్యులు మాట్లాడుతూ తమ పిల్లల వద్ద మద్యం లేదన్నా వినిపించుకోకుండా తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. ఈ ఘటనపై ఎస్‌హెచ్‌వో బాలనాగిరెడ్డి విచారణ చేపట్టారు.  


TAGS: POLICE GUNTUR