నీరు, మురుగు సమస్యపై ఆందోళన

ABN , First Publish Date - 2022-05-22T05:47:55+05:30 IST

తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నామని, పారిశుధ్య సమస్య పీడిస్తోందని దేవాంగనగర్‌ కాలనీకి చెందిన మహి ళలు రోడ్డెక్కారు.

నీరు, మురుగు సమస్యపై ఆందోళన
రోడ్డుకు అడ్డంగా చిల్లకంప వేసి నిరసన తెలుపుతున్న స్థానికులు

చిల్లకంప, రాళ్లు పెట్టి రాస్తారోకో

కనిగిరి, మే 21 : తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నామని, పారిశుధ్య సమస్య పీడిస్తోందని దేవాంగనగర్‌ కాలనీకి చెందిన మహి ళలు రోడ్డెక్కారు. శనివారం తెల్లవారుజామున పొదిలి రోడ్డులో రోడ్డుకు అ డ్డంగా చిల్లకంపలు, కొండరాళ్లు పెట్టి మహిళలు రోడ్డుపై బైఠాయించి నిర సన చేపట్టారు. దీంతో గంటపాటు వాహన రాకపోకలు స్తంభించాయి. స మాచారం తెలుసుకున్న పోలీసులు  అక్కడకు చేరుకుని రాళ్లను తొల గించి రాకపోకలు సాగేలా చర్యలు తీసుకున్నారు.  విషయం తెలుసు కున్న చైర్మన్‌ గఫార్‌ చేరుకుని దేవాంగనగర్‌ ప్రజలతో మాట్లాడారు. ఆ సమయంలో  కాలనీ వాసులు చైర్మన్‌తో మాట్లాడుతూ కౌన్సిలర్‌గా ఏక గ్రీవం చేసుకున్నారు. ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామన్నారు. ఇప్పు డేమో ఎన్నిసార్లు మా సమస్యలు చెప్పినా పట్టించుకోవడం లేదని చైర్మ న్‌కు ఫిర్యాదు చేశారు. పారిశుధ్యం మెరుగు పర్చాలని సదుద్దేశంతోనే ప్ర త్యేకంగా కాలువ తీయించి మురుగు నీటిని మళ్లించామని చైర్మన్‌  సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మాకు ఆ కాలువ వద్దని కాలనీ వాసులు భీ ష్మించారు. ఆ కాలువ వల్ల మురుగు నీరు నిలిచిపోతోందని, కంపుతో ఉండలేకపోతున్నామని తెలిపారు. తాగునీరు, వాడుక నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని చైర్మన్‌ ఎదుట వాపోయారు. నీటి సమస్యను పరిష్కరిస్తానని చైర్మన్‌ హామీ ఇవ్వడంతో కాలనీ వాసులు ఆందోళన విరమించారు. 


Updated Date - 2022-05-22T05:47:55+05:30 IST