ఏపీలో వైరస్ ఉధృతిపై వైద్య వర్గాల్లో ఆందోళన

ABN , First Publish Date - 2020-08-12T16:30:02+05:30 IST

ఏపీలో వైరస్ ఉధృతిపై వైద్య వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

ఏపీలో వైరస్ ఉధృతిపై వైద్య వర్గాల్లో ఆందోళన

అమరావతి: ఏపీలో వైరస్ ఉధృతిపై వైద్య వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రపంచంలో ప్రతి వందమందిలో ఒక ఆంధ్రుడు కరోనా వైరస్ బారిన పడుతున్నాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలోని జిల్లాలన్నీ డేంజర్ జోన్‌గా మారే అవకాశం ఉంది. దేశీయంగా ప్రతి వంద కేసుల్లో 10 మంది ఆంధ్రులే.. కరోనా వ్యాప్తిలో ఏపీ ఘనత ఇది. కేంద్ర ప్రభుత్వ గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

 

దేశంలో ఏపీ కన్నా అత్యధికంగా కేసులు మహారాష్ట్ర, తమిళనాడులో ఉన్నప్పటికీ యాక్టివ్ కేసుల్లో ఏపీ ఇప్పుడు దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. కట్టుదిట్టంగా వైరస్ కట్టడి చర్యలు చేపట్టడంతో ఇతర రాష్ట్రాల్లో కేసులు తగ్గడంతోపాటు డిశ్చార్జీలు పెరిగిపోతున్నాయి. ఏపీలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. రోజుకు సగటున 8 వేలమంది డిశ్చార్జ్ అవుతున్నా.. నిత్యం దాదాపు 10 వేల కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య సగటున 90 పైమాటే. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2020-08-12T16:30:02+05:30 IST