ధరల పెంపుపై ఆందోళన

ABN , First Publish Date - 2021-07-27T05:45:02+05:30 IST

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు వ్యతిరేకంగా సోమవారం స్థానిక పెట్రోల్‌ బంక్‌ వద్ద నెల్లిమర్ల నియోజకవర్గ స్థాయి నాయకులు ఆందోళన చేపట్టారు.

ధరల పెంపుపై ఆందోళన
ఆందోళన చేపడుతున్న టీడీపీ నేతలు

పూసపాటిరేగ, జూలై 26: పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు వ్యతిరేకంగా సోమవారం స్థానిక పెట్రోల్‌ బంక్‌ వద్ద నెల్లిమర్ల నియోజకవర్గ స్థాయి నాయకులు ఆందోళన చేపట్టారు. టీడీపీ నేత పతివాడ తమ్మినాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ, నెల్లిమర్ల మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ప్రజల నడ్డి విరిచేలా పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలు నేడు పెరిగాయని వీరు దుమ్మెత్తిపోశారు. ఈ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలనే పాలనగా భావిస్తోందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశంపార్టీ నాయకులు మహంతి చిన్నంనాయుడు, కర్రోతు బంగార్రాజు, కంది చంద్రశేఖర్‌, సువ్వాడ రవిశేఖర్‌, జిల్లా పార్టీ మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి, ఆకిరి ప్రసాదరావు, నాలుగు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

ప్రభుత్వ విఫలమే..

  నెల్లిమర్ల: పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు నియంత్రించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం అయ్యిందని టీడీపీ జిల్లా మహిళా పార్టీ అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి  అన్నారు. ఆమె సోమవారం విలేకర్లతో మాట్లాడారు. ధరల పెంపు వల్ల సామాన్యలపై పెనుభారం పడుతుందన్నారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మన రాష్ట్రంలోనే ఆకాశాన్ని అంటుతున్నాయని ఆమె విమర్శించారు. పెంచిన ధరలను తగ్గించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  

 

Updated Date - 2021-07-27T05:45:02+05:30 IST