విద్యాసంస్థల్లో అధిక ఫీజులపై ఆందోళన

ABN , First Publish Date - 2021-07-28T05:33:25+05:30 IST

పట్టణంలోని ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు శివన్న డిమాండ్‌ చేశారు.

విద్యాసంస్థల్లో అధిక ఫీజులపై ఆందోళన
పత్తికొండలో ఆర్‌ఐకి వినతిపత్రం ఇస్తున్న ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు

డోన్‌(రూరల్‌), జూలై 27: పట్టణంలోని ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు శివన్న డిమాండ్‌ చేశారు. డిప్యూటీ తహసీల్దార్‌కు మంగళవారం వినతి పత్రం అందజేశారు.
బేతంచెర్ల: ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఎంఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఎంఈవోకు వినతిపత్రం అందజేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు ఉదయ్‌, జగదీష్‌, ప్రదీఫ్‌, మనోహర్‌, మధు, నాగేంద్ర, ఇద్రుస్‌ పాల్గొన్నారు.


పత్తికొండటౌన్‌: ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో సాగిస్తున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని ఎఐఎస్‌ఎఫ్‌ నియోజకవర్గ అధ్యక్షుడు అల్తాఫ్‌, టౌన్‌  అధ్యక్షుడు నజీర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం పత్తికొండలో ఆర్‌ఐ బాలు నాయక్‌కు వినతిపత్రం అందజేశారు.   ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజేష్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి రవికుమార్‌, నియోజకవర్గ అధ్యక్షుడు వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.


కర్నూలు(ఎడ్యుకేషన్‌): జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేటం ముందు  ఆందోళన నిర్వహించారు. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగన్న, జిల్లా కార్యదర్శి శ్రీరాములుగౌడు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి సోమన్న, అధ్యక్ష కార్యదర్శులు శరత్‌కుమార్‌, సూర్యప్రతాప్‌, మునిస్వామి, విష్ణు, అంజి, రాముడు, ఇసాక్‌, రవి, ఏసేపు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-28T05:33:25+05:30 IST