చెత్తబండి డ్రైవర్ల ఆందోళన

ABN , First Publish Date - 2022-05-17T05:13:41+05:30 IST

గడిచిన 4 నెలలుగా జీతాలందక నానా అవస్థలు పడుతున్నామని చెత్త బండి డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రాయచోటి పట్టణంలోని మున్సిపల్‌ కార్యా లయం ఎదుట చెత్తబండి డ్రైవర్లు బైటాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెడ్డి ఎంటర్‌ప్రైజస్‌ ద్వారా చెత్తబండి డ్రైవర్లుగా పనిచేస్తున్న తమకు జనవరి 24 నుంచి ఇప్పటివరకు ఎటువంటి జీతం లేకుండా పనిచేస్తున్నామని చెప్పారు.

చెత్తబండి డ్రైవర్ల ఆందోళన
మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న దృశ్యం

4 నెలలుగా జీతాల్లేవంటూ ఆవేదన

రాయచోటిటౌన్‌, మే 16: గడిచిన 4 నెలలుగా జీతాలందక నానా అవస్థలు పడుతున్నామని చెత్త బండి డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రాయచోటి పట్టణంలోని మున్సిపల్‌ కార్యా లయం ఎదుట చెత్తబండి డ్రైవర్లు బైటాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెడ్డి ఎంటర్‌ప్రైజస్‌ ద్వారా చెత్తబండి డ్రైవర్లుగా పనిచేస్తున్న తమకు జనవరి 24 నుంచి ఇప్పటివరకు ఎటువంటి జీతం లేకుండా పనిచేస్తున్నామని చెప్పారు. గడిచిన 2 నెలలుగా జీతాల కోసం అడుగు తుంటే సంబంధిత అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ తమ కడుపులు కొడుతున్నారని ఆరోపించారు. 4 నెలలుగా జీతాలు లేకపోవ డంతో ఇంట్లోకి సరుకులు, బియ్యం తీసుకునేం దుకు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని, అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి వచ్చింద న్నారు. జీతాలు ఇచ్చేంత వరకు చెత్తబండ్లను కార్యాలయం నుంచి బయటకు తీయమని వారు గట్టిగా హెచ్చరించారు. కార్యక్రమంలో చెత్తబండి డ్రైవర్లు నాగేశ్వర్‌, మస్తాన్‌, అంజి, శేఖర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-17T05:13:41+05:30 IST