Abn logo
Apr 12 2021 @ 23:56PM

ఉపాధి కూలీల ఆందోళన

మెంటాడ, ఏప్రిల్‌ 12: మెంటాడలో సోమవా రం ఉపాధిహామీ  వేతనదా రులు ఆందోళన  వ్యక్తం చేశారు. ఉపాధి పనులను కొందరు అడ్డుకోవడంతో వారు తహసీల్దార్‌ కార్యాల యం ఎదుట నిరసన తెలి పారు. వివరాల్లోకి వెళ్తే..  మెంటాడ సమీపంలో ఓ శ్మశానవాటిక వద్ద పనిచే సేందుకు వందలాదిమంది ఉపాధి కూలీలు వెళ్లగా  కొందరు  అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ సాగు భూముల్లో పనులు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారి మధ్య కొద్దిసేపు వాగ్వా దం చోటుచేసుకుంది. దీంతో కూలీలు తహసీల్దార్‌ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి ఆందో ళన చేపట్టారు. దీనిపై తహసీల్దార్‌ రవి మాట్లాడుతూ పనులను అడ్డుకోవడం తగదన్నారు.  రెండు రోజుల్లో సర్వే జరిపించి ఆ భూములను స్వాధీ నం చేసుకుని ఉపాధి పనులకు ఆటంకం లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. దీంతో వేతనదారులు వెనుదిరిగారు. ఆక్రమణలను గురైన ప్రభుత్వ భూ ములన్నీ స్వాధీనం చేసుకుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, అలా కాకుండా కొందరినే లక్ష్యంగా చేసుకుంటే మాత్రం కోర్టుకు వెళ్తామని పలువురు  రైతులు స్పష్టం చేశారు.  దీనిపై తహసీల్దార్‌ రవి స్పందిస్తూ  శ్మశానవాటిక ఆక్రమణపై  ఇదివరకే ఫిర్యాదు అందిందని తెలిపారు. సర్వే జరిపించి హద్దులు గుర్తించా మన్నారు. ఉపాధి పనులు జరుగుతుండగా కొందరు రైతులు అడ్డుకో వడంతో కూలీలు ఆందోళన వ్యక్తం చేశారన్నారు. ఇంకోసారి సర్వే జరిపిస్తామన్నారు. Advertisement
Advertisement
Advertisement