పీఆర్‌సీ జోవోల రద్దు కోరుతూ ఉద్యోగుల ఆందోళన

ABN , First Publish Date - 2022-01-26T06:02:33+05:30 IST

పీఆర్‌సీ విషయంలో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొంటూ గాజువాకలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మంగళవారం గాజువాక జోనల్‌ కార్యాలయం వద్ద నినాదాలు చేశారు.

పీఆర్‌సీ జోవోల రద్దు కోరుతూ ఉద్యోగుల ఆందోళన
గాజువాక జోనల్‌ కార్యాలయం ముందు నినాదాలు చేస్తున్న ఉద్యోగులు

గాజువాక, జనవరి 25: పీఆర్‌సీ విషయంలో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొంటూ గాజువాకలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మంగళవారం గాజువాక జోనల్‌ కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. గాజువాక వంద అడుగుల రోడ్డు మీదుగా పోలీస్‌, స్టేషన్‌ జంక్షన్‌ వరకు ర్యాలీ చేపట్టారు. పీఆర్‌సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

న్యాయశాఖ ఉద్యోగులు నిరసన

పీఆర్‌సీపై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా మంగళవారం గాజువాక న్యాయశాఖ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పీఆర్‌సీ ప్రకటన ఆమోదయోగ్యంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా  ప్రభుత్వం ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన పీఆర్‌సీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బొత్స వరప్రసాదరావు, మీగడ సాయికుమార్‌, లక్ష్మి ప్రసన్నకుమార్‌, అంబికేశ్వరరావు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-26T06:02:33+05:30 IST