తాగునీటి కోసం దేవీరమ్మ కాలనీ వాసుల ఆందోళన

ABN , First Publish Date - 2021-07-27T06:19:32+05:30 IST

పట్టణంలోని దేవీరమ్మ కాలనీ వాసులు సోమవారం తా గునీటి కోసం ఆందోళనకు దిగారు. కాలనీ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో నిరసన తె లియజేశారు.

తాగునీటి కోసం దేవీరమ్మ కాలనీ వాసుల ఆందోళన
కాలనీలో ఖాళీ బిందెలతో ఆందోళన చేస్తున్న మహిళలు

కళ్యాణదుర్గం, జూలై26: పట్టణంలోని దేవీరమ్మ కాలనీ వాసులు సోమవారం తా గునీటి కోసం ఆందోళనకు దిగారు. కాలనీ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో నిరసన తె లియజేశారు. నీటిసరఫరా లేకపోవడంతో వాటర్‌ప్లాంట్ల వద్దకు వెళ్లి బిందె రూ.10లతో కొ నుగోలుచేసి దాహార్తి తీర్చుకుంటున్నామని గంగమ్మ, సరస్వతీ, లక్ష్మీదేవి తదితరులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని పలుమార్లు పాలకులు, మున్సిపల్‌ అధికారులకు విన్నవించినా ఫలితంలేదని వాపోయారు. మూడురోజులకోసారి మున్సిపల్‌ నీటిట్యాంకు వస్తున్నా, ఆనీరు కాలనీ జనాభాకు ఏమాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనాభాకు అనుగుణంగా తాగునీటిని సరఫరా చేయాలని కోరారు. 

Updated Date - 2021-07-27T06:19:32+05:30 IST