Advertisement
Advertisement
Abn logo
Advertisement

భైంసాలో దళిత సంఘాల ఆందోళన

భైంసా/భైంసా క్రైం, అక్టోబరు 25: భైంసాలో సోమవారం దళిత సంఘాల ఆందోళనలు హోరెత్తాయి. స్థానిక బస్టాండ్‌ ఎదుట గల అంబేద్కర్‌ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ సోమవారం దళిత సంఘాలకు చెంది న మహిళలు ఆందోళనలు నిర్వహించాయి. పట్టణంలోని పలు ప్రాంతాలకు చెందిన దళిత మహిళలు నిరసన ర్యాలీలు చేపడుతూ బస్టాండ్‌ ఎదుట గల అంబేద్కర్‌ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడి రోడ్డుపై బైఠాయించి అంబే ద్కర్‌ విగ్రహా పాక్షిక ధ్వంసం ఘటనను నిరసిస్తూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అనంతరం భైంసా ఏఎస్పీ కిరణ్‌ ఖారే, ఆర్డీవో లోకేష్‌ ఆధ్వర్యంలో ఆందో ళన కారులను సముదాయించారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు విగ్రహంపై దాడికి పాల్పడ్డ వ్యక్తిని తమకు అప్పగించాలని, లేనిపక్షంలో ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమయంలో ఏఎస్పీ కిరణ్‌ ఖారే, ఆర్డీవో లోకేష్‌లు దాడికి పాల్పడ్డ నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లుగా వివరించారు.  అయి నప్పటికీ మహిళలు ఆందోళన విరమించకుండా అక్కడి నుంచి నిర్మల్‌ క్రాస్‌ రోడ్డుమార్గంలో గల జాతీయ రహదారికి చేరుకొని ఆందోళన చేపట్టారు. అక్కడ వాహన రాకపోకలను అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. కాగా, పోలీసుశాఖ పకడ్బందీ చర్యల్లో భాగంగా పట్టణంలో వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసి ఉంచాలని సూచించింది. అందుకు అనుగుణంగా సోమవారం భైంసాలో పూర్తిస్థాయిలో వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరుచుకోలేదు.

Advertisement
Advertisement