నిర్మల్: జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ వద్ద బీఎస్పీ నేతలు మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని మెయిన్ గేటు వద్ద ధర్నాకు దిగారు. కాగా..బీఎస్పీ నేతలను లోపలికి అనుమతించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. ట్రిపుల్ ఐటీని అస్తవ్యస్తంగా మార్చి విద్యార్థులను వేధిస్తున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి