జాతీయ విద్యావిధానంపై సమగ్ర చర్చ

ABN , First Publish Date - 2020-08-11T09:40:56+05:30 IST

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నూతన జాతీయ విద్యావిదానం - 2020 పై ఆన్‌లైన్‌ వెబినార్‌ జరిగింది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ..

జాతీయ విద్యావిధానంపై సమగ్ర చర్చ

ఎఎన్‌యుః ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నూతన జాతీయ విద్యావిదానం - 2020 పై ఆన్‌లైన్‌ వెబినార్‌ జరిగింది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి రాజశేఖర్‌ స్వాతగోపన్యాసం చెప్తూ 34 ఏళ్ల తర్వాత నూతన విద్యా విధానంలో అనేక మార్పులు చేపట్టడం జరిగిందని, వీటన్నింటిని ప్రజలందరూ ముఖ్యంగా విద్యార్ధులు, అధ్యాపకులు మరియు విద్యాధికులు కూలంకషంగా అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈ వెబినార్‌ను నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్య అతిధి మరియు ముఖ్య వక్త ఆంధ్రప్రదేశ్‌ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానంలో విద్యా సంస్థల పరంగా మౌలిక వసతుల పరంగా, నూతన కోర్సుల పరంగా అనేక సంస్కరణలు చేపట్టడం జరిగిందన్నారు.  నూతన విద్యా విధానం వల్ల తప్పకుండా పట్టబద్రులైన విద్యార్ధులందరికీ ఉపాధి దొరుకుతుందనే నమ్మకం ఉందని, అదే దిశలో రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్ధులందరికి నైపుణ్య శిక్షణ అందించాలని 30 నైపుణ్య కేంద్రాలను స్థాపించబోతుందన్నారు. 


ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ సిఎం జగన్‌ ఏ ఒక్క పేద విద్యార్ధి చదువుకు దూరమవ్వకూడదనే ఉద్దేశంతో జగనన్న అమ్మఒడి పథకం జగనన్న విద్యా దీవెన వంటి అనేక పథకం ద్వారా పేద విద్యార్ధులకు ఆర్ధిక భరోసా అందిస్తున్నారన్నారు. ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్‌ రామమోహన్‌రావు మాట్లాడుతూ నూతన విధానంలో బహుల పాఠ్యాంశాలలో విద్యార్ధిని తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ మాజీ వీసీలు బాలమోహన్‌దాసు,  హరగోపాలరెడ్డి,  కె వియన్నారావు , వెబినార్‌ కోఆర్డినేటర్‌ ఆచార్య శ్రీనివాసరెడ్డి , రిజిస్ట్రా్ట్రర్‌ రోశయ్య, ర్యాంకుల సమన్వయకర్త భవనం నాగకిశోర్‌, ఆచార్య మధుబాబు, భట్టు నాగరాజు, ఉదయకుమార్‌, అమృతవల్లి, ఆచార్య సరస్వతి రాజు అయ్యర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-11T09:40:56+05:30 IST