Abn logo
Dec 5 2020 @ 01:07AM

శ్మశాన వాటికలను త్వరగా పూర్తి చేయాలి

జిల్లా అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే

మామడ, డిసెంబరు 4 : స్మశాన వాటికలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అన్నారు. శుక్రవారం రోజున మండలంలోని పరిమండల్‌, న్యూలింగంపెల్లి, మొండిగుట్ట, బూరుగుపెల్లి, జగదాంబ తాండ, ఆరేపెల్లి, వాస్తపూర్‌, రాసిమెట్ల, కిసాన్‌రావ్‌పేట్‌ గ్రామాలలో జరుగుతున్న స్మశాన వాటిక పనులను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో ఆయన మాట్లాడుతూ వారం రోజులలో పనులు పూర్తి చేయాలని లేకుంటే చర్యలు తప్పవని అన్నారు. గ్రామంలో సెర్జీకల్‌ షెడ్‌, డంపింగ్‌ యార్డ్‌ ఆలస్యం లేకుండా చూడాలని, పారిశుధ్య లోపం తలెత్తకుండా తగు సూచనలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌ రావు, ఎంపీడీవో రమేష్‌, ఏపీవో శివాజీ, ఎంఏవో కలీం, పంచాయతీ రాజ్‌ ఏఈ కృష్ణ శంకర్‌, సర్పంచ్‌లు అరవింద్‌ రావు, గంగాధర్‌, సంతోష్‌, కిచ ్యనాయక్‌, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement