Abn logo
Mar 7 2021 @ 00:16AM

మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు

కర్నూలు(కలెక్టరేట్‌), మార్చి 6: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్‌లో ఉద్యోగినులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాలు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచు తాయని కలెక్టర్‌ వీరపాండియన్‌ సతీమణి ఆండాలు అన్నారు. జేసీల సతీమణులు ప్రసన్న, షహనాజ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సతీమణి పృథ్వీ కళ్యాణి చేతుల మీదుగా ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. మూడు రోజుల పాటు షటిల్‌ బాడ్మింటన్‌, త్రో బాల్‌, లాంగ్‌ జంప్‌, హైజంప్‌, టగ్‌ఆఫ్‌ వార్‌ పోటీలు నిర్వహిస్తారు. విజేతలకు మార్చి 8న మహిళా దినోత్సవ సమావేశంలో కలెక్టర్‌ చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement