‘పది’ పరీక్షలు పూర్తి

ABN , First Publish Date - 2022-05-29T05:47:48+05:30 IST

మండల కేంద్రంతో పాటు, మాచర్లలో నిర్వహించిన ‘పది’ పరీక్షలు శనివారం ప్రశాంతగా ముగిశాయి.

‘పది’ పరీక్షలు పూర్తి
‘పది’ పరీక్షల అనంతరం విజయచిహ్నం చూపిస్తున్న పుల్లూరు జ్యోతిబా పూలే విద్యార్థినులు


గద్వాల టౌన్‌, మే 28: జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈనెల 23వ తేదీన ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. చివరిరోజు సాంఘీకశాస్త్రం పరీక్షకు  జిల్లా వ్యాప్తంగా  41 కేంద్రాల్లో మొత్తం 8013 మంది విద్యార్థులకు గాను 7910(98.69శాతం) మంది పరీక్ష రాయగా, మిగతా 105 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.  జిల్లాలో ఏర్పాటు చేసిన 43 పరీక్షా కేంద్రాల్లో తొలిరోజు 8012 మందికిగాను 7,905 మంది, రెండవ రోజు 8013కి గాను 7915, మూడవ రోజు8012కు గాను, 7912, నాల్గవ రోజు 8013కి గాను, 7914, ఐదోరోజు 8015కు గాను 7915 మంది, చివరి రోజు 8013కి గాను 7910 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, వరుసగా తొలిరోజు 107, రెండవరోజు 98, మూడవరోజు 100, నాల్గవరోజు 99, ఐదో రోజు 100, ఆరవరోజు 105 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలో ఏ కేంద్రంలోనూ మాస్‌కాపీయింగ్‌, డీబార్‌ వంటి ఘటనలు చోటు చేసుకోలేదని డీఈవో మహ్మద్‌ సిరాజుద్దీన్‌ తెలిపారు.  జ నరల్‌ పరీక్షలు ముగిశాయని, వృత్తి విద్యకు సంబంధించి సోమవారం పరీక్ష ఉం టుందని దీంతో ‘పది’ పబ్లిక్‌ పరీక్షలు పూర్తిగా ముగుస్తాయని డీఈవో వివరించారు.  

గట్టు : మండల కేంద్రంతో పాటు, మాచర్లలో నిర్వహించిన ‘పది’ పరీక్షలు శనివారం ప్రశాంతగా ముగిశాయి. గట్టు గురుకుల పాఠశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రంలో మొత్తం 206 మంది విద్యార్థులకు గా ను 205 మంది హాజరు కాగా, ఒకరు గైర్హాజరయ్యారు. గట్టు జడ్పీహెచ్‌ఎస్‌లో ఏర్పాటుచేసిన కేంద్రంలో 123 మందికి గాను మొత్తం హాజరయ్యారు. జడ్పీహెచ్‌ఎస్‌ మాచర్లలో 159 మంది విద్యార్థులకు గాను 156 మంది మాత్రమే హాజరు కాగా, ముగ్గురు విద్యార్థులు గైర్హాజర య్యారని ఎంఈవో కొండారెడ్డి తెలిపారు. విద్యార్థులు పరీక్షలు రాసి బయటకు వస్తూ ఉత్సాహంగా కన్పిం చారు. పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో ఉపాధ్యాయులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. 

ధరూరు : మండల కేంద్రంతో పాటు, ఉప్పేరు, మార్లబీడు పాఠశాలల్లో పది పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎంఈవో సురేష్‌ తెలిపారు. ధరూరు పాఠశాలలో 286 మంది విద్యార్థులకు గాను 283 మంది హాజరుకాగా ముగ్గురు గైర్హాజరయ్యారు. ఉప్పేరు పాఠశాలలో 280 హాజరుకాగా ఐదుగురు గైర్హాజరయ్యారు. మార్లబీడు పాఠశాలలో 286 మందికిగాను 284 హాజరుకాగా ఇద్దరు గైర్హాజరైనట్లు ఎంఈవో పేర్కొన్నారు. 

అలంపూరు : మండల కేంద్రంలో ‘పది’ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. స్థానిక జడ్పీహెచ్‌ఎస్‌ హరిజనవాడ పాఠశాల, ప్రభుత్వ బాలుర పాఠశాల, జడ్పీహెచ్‌ఎస్‌ న్యూప్లాట్స్‌ పాఠశాల, మాంటిస్సోరి హై స్కూల్‌లో విద్యార్థులు పరీక్షలు రాయగా,  చివరిరోజు పరీక్షలు ముగియడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. పై నాలుగు కేంద్రాల్లో మొత్తం 706 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని ఎంఈవో అశోక్‌కుమార్‌ తెలిపారు.  

అయిజ : పదవ తరగతి పరీక్షలు శనివారంతో పూర్తయ్యాయి. అయిజలోని ఆరు పరీక్షా కేంద్రాల్లో 990 మంది విద్యార్థులకు గాను 971 మంది పరీక్షలు రాయ గా, 19 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 

మల్దకల్‌ : ‘పది’ పరీక్షలు ప్రశాంతంగా ముగిశా యి. మండల కేంద్రంలోని మూడు కేంద్రాల్లో 478 మం ది విద్యార్దులు పరీక్షలకు హాజరయ్యారు. డీఈవో మహమ్మద్‌ సిరాజుద్దీన్‌, తహసీల్దార్‌ లక్ష్మి పరీక్షలను అకస్మిక తనిఖీలు చేయగా, మల్దకల్‌ ఎస్సై శేఖర్‌ పరీక్షా కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరుగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. 

ఉండవల్లి : పదవ తరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. మండల కేంద్రంలోని మూడు పరీక్ష కేంద్రాల్లో 478 మంది విద్యార్థులు పరీక్షలు రాయా ల్సి ఉండగా, పరీక్షలు జరిగిన అన్ని పేపర్లకు నలుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు పరీక్ష కేంద్రాల ముఖ్య పర్యవే క్షకులు నిర్మలాజ్యోతి, వెంకటేశ్వర్లు, అమరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం జడ్పీహెచ్‌ఎస్‌ పరీక్షా కేంద్రాన్ని పరీ క్ష కేంద్రాల జిల్లా పర్యవేక్షణ అధికారి శ్రీనివాసులు తని ఖీ చేశారు. విద్యార్థులెవరూ మాస్‌ కాపీయింగ్‌ పాల్పడ లేదని తెలిపారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థినీ, వి ద్యార్థులు విక్టరీ సింబల్‌ను చూపిస్తూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. 

రాజోలి : మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో ‘పది’ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చీఫ్‌ సూపరింటెండెంట్‌ హరున్‌ రషీద్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ మద్దిలేటి పరీక్షలను పర్యవేక్షించారు. మొత్తం 144 మంది విద్యార్థులకు గాను 141 మంది పరీక్షలు రాయగా, ముగ్గురు గైర్హాజరైనట్లు ఎంఈవో నర్సింహులు తెలిపారు. 



Updated Date - 2022-05-29T05:47:48+05:30 IST