15లోగా సర్వే పూర్తి చేయండి

ABN , First Publish Date - 2022-07-02T05:42:29+05:30 IST

శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద చేపట్టిన సమగ్ర భూ సర్వే రెండో విడతను ఈ నెల 15లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ సూర్యకుమారి ఆదేశించారు. త

15లోగా సర్వే పూర్తి చేయండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ సూర్యకుమారి


కలెక్టర్‌ సూర్యకుమారి

కలెక్టరేట్‌, జూలై 1:
శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద చేపట్టిన సమగ్ర భూ సర్వే రెండో విడతను ఈ నెల 15లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ సూర్యకుమారి ఆదేశించారు. తన చాంబర్‌లో ఆయా శాఖల అధికారులతో సర్వే తీరుపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో 993 గ్రామాలకు గాను 445 గ్రామాల్లో ఇప్పటికే డ్రోన్‌ సర్వే పూర్తయిందన్నారు. ప్రయోగాత్మకంగా డివిజన్‌కు ఒకటి చొప్పున తొలుత రెండు గ్రామాల్లో సర్వే చేపట్టామని, రెండో విడతలో 65 గ్రామాల్లో సర్వే చేపట్టామని చెప్పారు. వీటిలో ఇప్పటివరకూ 48 గ్రామాల్లో సర్వే పూర్తయిందన్నారు. మిగిలిన గ్రామాల్లో ఈనెల 15 నాటికి పూర్తి చేయాలన్నారు. భూములు సర్వే చేపట్టేటప్పుడు సంబంధిత భూముల యజమానులు హాజరు కావాలని కలెక్టర్‌ కోరారు. వారికి ముందుగానే అధికారుల నుంచి సమాచారం వెళ్లాలన్నారు. ఖచ్చితమైన ఆధార్‌, ఫోన్‌ నెంబర్‌, మొయిల్‌ ఐడీని అధికారులకు అందజేయాలని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న వారైనా తమ భూములు సర్వే జరిగినప్పుడు హాజరయ్యేందుకు ప్రయత్నించాలని కలెక్టరు చెప్పారు. జేసీ మయూర్‌అశోక్‌ మాట్లాడుతూ జిల్లాలో సర్వేను త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు. రోజకు 20 ఎకరాల భూమిని సర్వే చేయాలన్నారు. కార్యక్రమంలో సర్వే శాఖ ఏడీ టి.త్రివిక్రమరావు, డీపీవో సుభాషిణి తదితరులు ఉన్నారు.
ఫ స్థానిక బాబామెట్ట నల్లచెరువు సమీపంలో ఉన్న శిల్పారామంలో ఈనెల 3తేదీన పండ్లు, పూల మొక్కల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ సూర్యకుమారి ఒక ప్రకటనలో తెలిపారు.  



Updated Date - 2022-07-02T05:42:29+05:30 IST