మరమ్మతుల పనులు పూర్తి చేసి నీరందించండి

ABN , First Publish Date - 2022-05-25T06:29:43+05:30 IST

జిల్లాలో 27, 28 ప్యాకేజీ, సదర్‌మాట్‌ బ్యారేజీ, చెక్‌డ్యాంల మరమ్మతు పనులు పునరుద్ధరణ త్వరితగతిన పూర్తిచేసి పంట లకు సాధ్యమైనంత తొందరగా నీరందించేందుకు ఇంజనీరింగ్‌ అధికారులు కృషి చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు.

మరమ్మతుల పనులు పూర్తి చేసి నీరందించండి
మాట్లాడుతున్న మంత్రి

నిర్మల్‌ కల్చరల్‌, మే 24 : జిల్లాలో 27, 28 ప్యాకేజీ, సదర్‌మాట్‌ బ్యారేజీ, చెక్‌డ్యాంల మరమ్మతు పనులు పునరుద్ధరణ త్వరితగతిన పూర్తిచేసి పంట లకు సాధ్యమైనంత తొందరగా నీరందించేందుకు ఇంజనీరింగ్‌ అధికారులు కృషి చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం అరణ్య భవన్‌లో ఆయన సమీక్షాసమావేశం నిర్వహించారు. పురోగతిని అడిగి తెలు సుకున్నారు. గత ఏడాది 110 చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయని గుర్తు చేశారు. వాటి పునరుద్ధరణపై ప్రశ్నించగా 28 చెరువులు పూర్తయినట్లు అధి కారులు వివరించారు. మిగతాపనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. మొదటి విడతలో 18 చెక్‌డ్యాంలు పూర్తయ్యాయని, రెండోదశ కోసం 43 చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. మంత్రి ఈ సందర్భంగా 150 కోట్లతో 25 చెక్‌ డ్యాంల నిర్మాణానికి ఎస్టిమేట్స్‌ సిద్ధం చేసి టెండర్లు పూర్తి చేయాలని ఆదేశించారు. 27 ప్యాకేజీ ద్వారా జూలై లోగా నీరందిం చేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. సదర్‌మాట్‌ గేట్ల బిగింపు ప్రక్రియ మరింత వేగవంతం చేయాలన్నారు. 28 ప్యాకేజీ కాంట్రాక్టుకు కొత్తగా టెండ ర్లు పిలవాలని ఆదేశించారు. ముధోల్‌ నియోజకవర్గం గుండెగామ్‌ ముంపు సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కోరారు. దీనిపై స్పందిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఇరిగేషన్‌ స్పెషల్‌ సీఎస్‌ రజిత్‌ కుమార్‌, ఎమ్మెల్యేలు రేఖానాయక్‌, ఈఎన్సీ మురళీధర్‌, ఉమ్మడి ఆదిలాబాద్‌ ఇన్‌చార్జి సీఈ వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ సుశీల్‌ కుమార్‌, ఈఈ రామారావు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T06:29:43+05:30 IST