‘డబుల్‌’ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయండి

ABN , First Publish Date - 2021-02-24T06:17:51+05:30 IST

జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అధికారులను ఆదేశించారు.

‘డబుల్‌’ నిర్మాణాలను వెంటనే పూర్తి చేయండి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

నిర్మల్‌ టౌన్‌, ఫిబ్రవరి 23 : జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సంబంధిత శాఖల అధికారుల, గుత్తేదారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 6686 ఇళ్లు మంజూరు కాగా నిర్మల్‌ నియోజకవర్గంలో 3761, ముధోల్‌ నియో జకవర్గంలో 2240, ఖానాపూర్‌ నియోజకవర్గంలో 685 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. 5641 ఇళ్లకు పరిపాలన అనుమతులు లభించాయని, 3184 ఇళ్లకు టెండర్‌ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు 951 ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయడం జరిగిందని, మిగతా ఇళ్లు వివిధదశల్లో నిర్మాణంలో ఉన్నాయని తెలి పారు. సిమెంట్‌, రాడ్‌ అందుబాటులో ఉంచా లని, గుత్తేదారుల పెండింగ్‌ బిల్లుల చెల్లింపునకు వెంట నే చర్యలు చేపట్టాలని సూచించారు. నిర్మాణ పను ల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అన్నారు. ఇప్పటికే పూర్తయిన కాలనీ లలో ప్రతీ ఇంటికి మిషన్‌ భగీరథ తాగునీరు, విద్యుత్‌ సరఫరా, రోడ్లు, మురికి కాలువల నిర్మాణా లను సంబంధిత శాఖల అధికారులు సమ న్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదే శించారు. ఈ సమావేశంలో రెండు పడక గదుల ఇళ్ల జిల్లా నోడల్‌ అధికారి సత్యనారాయణ, పంచా యతీరాజ్‌ శాఖ ఈఈ శంకరయ్య, రోడ్డు మరియు భవనాలశాఖ ఈఈ అశోక్‌కుమార్‌, డీఈ రవీందర్‌ రెడ్డి, అధికారులు, కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొ న్నారు. 

కల్లాల నిర్మాణాలను వేగవంతం చేయాలి

పంటకల్లాల నిర్మాణాలను వేగవంతం చేయా లని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అధికా రులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో పంట కల్లాల నిర్మాణాలపై సంబంధిత శాఖల అధికా రులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ పల్లెప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనుల నిర్మానాలను వందశాతం పూర్తి చేయాలని ఆదేశిం చారు. ప్రభుత్వం జిల్లాకు 2527 కల్లాలను ప్రభు త్వం మంజూరు చేసిందని, ఇప్పటి వరకు 986 పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగతా నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. సంబంధిత శాఖల అధికారులు నిర్మాణాల పురో గతిని ప్రతీరోజు పర్యవేక్షించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ పనులలో నాణ్య త లోపిస్తే సహించేది లేదని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Updated Date - 2021-02-24T06:17:51+05:30 IST