భవన నిర్మాణాలు పూర్తి చేయండి : కలెక్టర్‌ మిశ్రా

ABN , First Publish Date - 2021-05-13T06:07:40+05:30 IST

ర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా చెప్పారు. -

భవన నిర్మాణాలు పూర్తి చేయండి  : కలెక్టర్‌ మిశ్రా
అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

ఏలూరు, మే 12 (ఆంధ్రజ్యోతి): నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా చెప్పారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయన పంచాయతీరాజ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవనాల నిర్మాణ పనులు ఏయే దశల్లో ఉన్నా యో సమీక్షించుకుని ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలని సూచించారు.  జిల్లాలో 909 గ్రామ, వార్డు సచివాలయ భవనాలను ప్రారంభించగా వాటిలో శ్లాబ్‌ లెవల్‌కు వచ్చినవి 239, శ్లాబ్‌ పూర్తయి ఫినిషింగ్‌ దశలో ఉన్నవి 571 ఉండగా 99 భవనా లను పూర్తిగా నిర్మించామన్నారు. 920 రైతు భరోసా కేంద్రాలకుగాను 551 శ్లాబ్‌ లెవల్‌కు, 346 ఫినిషింగ్‌ దశకు వచ్చాయని, 22 భవనాలను పూర్తి చేశామని ఆయన తెలిపారు. వీటితోపాటు 719 హెల్త్‌ క్లినిక్‌లకు గాను 481 శ్లాబ్‌ లెవల్‌కు, 223 ఫినిషింగ్‌ దశకు రాగా, 15 భవనాలను పూర్తి చేశామన్నారు. మొదటి దశలో చేపట్టిన 183 బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లలో 153 సెంటర్ల పనులు పురోగతిలో ఉన్నాయని, 36 అంగన్వాడీ సెంటర్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. 

ఇళ్ల పట్టాలకు అదనపు భూమి సేకరించండి 

జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీకి అదనంగా అవసరమైన 143 ఎకరాల భూ సేకరణను వచ్చే మంగళవారం నాటికి పూర్తిచేయాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పేదల ఇళ్ల కార్యక్రమంపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో నూతనంగా 990 మంది ఇళ్ల పట్టాలకు దరఖాస్తు చేసుకున్నారని, వారికి సకాలంలో ఇళ్ల స్థలాల మంజూరు చేసేందుకు అవసరమైన భూమిని సేకరించాలన్నారు. జిల్లాలో 1,141 లే అవుట్లలో మోడల్‌ హౌస్‌లను నిర్మించాలని ఆదేశించారు. 433 సైట్లలో ఇంకా మోడల్‌ ప్రారంభించలేదని, వీటిని త్వరితగతిన ప్రారంభించాలన్నారు.మోడల్‌ హౌస్‌ల నిర్మాణం ఈ నెల 25 నాటికి 50 శాతానికి వెళ్లాలని అన్నారు.  జిల్లాలో 53,696 మంది ఆప్షన్‌ 2 కింద ఇళ్లు నిర్మించుకునేందుకు ఎంపిక చేసుకున్నారని, అందులో ఇప్పటి వరకూ 9,398 మాత్రమే గ్రౌండ్‌ అయ్యాయని, ఈ నెలాకరుకు 20 వేలకు ఇళ్ల గ్రౌండింగ్‌ జరగాలన్నారు. జేసీ కె. వెంకట రమణారెడ్డి, హౌసింగ్‌ పీడీ రామరాజు, నీటిపారుదల ఎస్‌ఈ రామస్వామి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-13T06:07:40+05:30 IST