Abn logo
Feb 25 2021 @ 01:09AM

‘ఆర్‌బీకేల ద్వారా రైతులకు పూర్తి సేవలు’

 పాయకరావుపేట, ఫిబ్రవరి 24 : పంటల సాగుకు సంబంధించిన అన్నిరకాల సేవలు రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామా ల్లోనే అందించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా వ్యవసాయ  సహాయ సంచాలకురాలు జి.లీలావతి తెలిపారు. బుధవారం ఇక్కడ పాయకరావుపేట సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఐదు మండలాల ఆర్‌బీకేల ఇన్‌చార్జిలకు ఏర్పాటైన అవగాహన సదస్సులో మాట్లా డారు. వ్యవసాయ పరంగా రైతులకు ఎటు వంటి సమస్య వచ్చినా పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అనంతరం  ఆమె విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు ఈ క్రాప్‌ 81 శాతం పూర్తయినట్టు చెప్పారు.  ఎరువుల కోసం రైతులు మండల కేంద్రానికి రానవసరం లేకుండా  ఆర్‌బీకేల వద్ద ఐదు నుంచి ఆరు టన్నుల వరకు అందుబాటులో ఉంచుతున్నామన్నారు.  సాంకేతిక సమస్యలు తక్షణ పరిష్కారానికి 15525 టోల్‌ ఫ్రీ నంబరుకు రైతులు ఫోన్‌ చేయాలని సూచించారు.  ఏడీఏ సీహెచ్‌. లచ్చన్న, హబ్‌ మేనేజర్‌ శ్రీకాంత్‌, రవితో పాటు  ఏవోలు, ఈఏవోలు పాల్గొన్నారు.

 సస్యరక్షణతో అపరాల దిగుబడి

పాయకరావుపేట రూరల్‌: సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే అపరాలలో అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ లీలావతి అన్నారు. మంగవరంలో బుధవారం నిర్వహించిన పొలం బడిలో మాట్లాడారు.


Advertisement
Advertisement
Advertisement