ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టులకు భూసేకరణ పూర్తిచేయండి

ABN , First Publish Date - 2020-02-20T09:50:45+05:30 IST

నేషనల్‌ హైవే అధారిటీ ఆఫ్‌ ఇండియా చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ

ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టులకు భూసేకరణ పూర్తిచేయండి

అధికారుల సమీక్షలో రవాణాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ


నెల్లూరు(హరనాథపురం), ఫిబ్రవరి 19 : నేషనల్‌ హైవే అధారిటీ ఆఫ్‌ ఇండియా చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర అర్‌ అండ్‌ బీ, రవాణాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం బంగ్లాలో కలెక్టర్‌ శేషగిరిబాబుతో కలిసి రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అత్యంత ప్రాధాన్యం కలిగిన నాయుడుపేట-రేణిగుంట రోడ్డు మార్గాన్ని 6 లైన్లుగా మారుస్తున్నందున, అందుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని నాయుడుపేట ఆర్డీవోను ఆదేశించారు.


10 రోజులలోపు భూసేకరణ ప్రక్రియ పూర్తిచేస్తామని ఆర్డీవో  సరోజని ప్రిన్సిపల్‌ సెక్రటరీకి తెలిపారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైనుకు సంబంఽధించి, మూడో రైల్వేలైను నిర్మాణానికి సంబంధించి భూసేకరణ త్వరగా పూర్తిచేయాలని కృష్ణబాబు సూచించారు.  కలెక్టర్‌ శేషగిరిబాబు మాట్లాడుతూ నేషనల్‌హైవే అధారిటీ జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తిచేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకోసం అదనపు సిబ్బందిని నియమించామన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ బాస్కర్‌ భూషణ్‌,  జేసీ వినోద్‌కుమార్‌, నేషనల్‌ హైవే నెల్లూరు పీడీ సంజయ్‌, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-20T09:50:45+05:30 IST