Abn logo
Jun 20 2021 @ 00:10AM

రైతు భరోనా కేంద్రాలను పూర్తి చేయండి

జలుమూరు: అక్కురాడ ఆర్‌బీకే పనులు పరిశీలిస్తున్న శాంతిశ్రీ

డీఆర్‌డీఏ  పీడీ శాంతిశ్రీ

జలుమూరు, జూన్‌ 19 : రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణాలు వేగవంతం చేసి, వచ్చే నెల 8 నాటికి పూర్తిచేయాలని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.శాంతిశ్రీ ఆదేశించారు. ఈ మేరకు శనివారం అక్కురాడ, సైరిగాం రైతు భరోసా కేంద్రాల నిర్మాణ పనులు ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో 24 ఆర్‌బీకే కేంద్రాలకు భవనాలు మంజూరైనప్పటికీ ఆరు భవనాలు పనులు మాత్రమే వివిధ దశల్లో జరుగుతున్నాయన్నారు. మిగతా భవనాలు పనులు కూడా త్వరిత గతిన ప్రారంభింలన్నారు. స్థలాలు లేనిచోట పోరంబోగు స్థలాలు గుర్తించాలన్నారు. అర్హులందరికీ పింఛన్లు అందేలా చూడాలాన్నారు. వైఎస్సార్‌ బీమా సర్వే వేగవంతం చేయాలని సూచించారు. ఎంపీడీవో ఎ.దామోదరరావు, ఈవోపీఆర్డీ జి.శ్యామల కుమారి, మండల ఇంజినీర్‌ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.ఫ కవిటి:  అభివృద్ధి పనులు సత్వరమే ప్రారం భించాలని ఎంపీడీవో పి.సూర్యనా రాయణ కోరారు.  శనివారం   జగతిలో పర్యటించా రు. ఈ సందర్భంగా పంచాయతీ రాజ్‌ జేఈ ప్రవీణ్‌తో మాట్లాడారు. మండలంలో 20 సచివాలయాలు పనులు, 17 ఆర్బీకేల పను లు ప్రారంభించినట్లు తెలిపారు.  సర్పంచ్‌ల బ్యాంకు ఖాతాలు వెంటనే ప్రారంభించి బిల్లులు చెల్లిస్తామని చెప్పారు. కార్యక్ర మంలో సర్పంచ్‌ పి.వరప్రసాద్‌, మాజీ సర్పంచ్‌ పి.నేతాజీ, గ్రామపెద్దలు పి.వెంక టేశం,బి.నారాయణమూర్తి, బి.రవి  పాల్గొన్నా రు.  ఫ పాలకొండ: భవన నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని ఎంపీడీవో  జె.ఆనందరావు అధికారులు, కాంట్రాక్టర్లను కోరారు. శనివారం మండలంలోని చిన్నమంగళాపురం, గొట్టమంగళాపురం పంచాయతీల్లో జరుగు తున్న భవన నిర్మాణాలను పరిశీలించారు.