కొత్త జిల్లాలతో సంపూర్ణ అభివృద్ధి

ABN , First Publish Date - 2022-01-29T04:40:31+05:30 IST

రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యం, సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతాయని సూళ్లూరుపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు కిలివేటి సంజీవయ్య అన్నారు.

కొత్త జిల్లాలతో సంపూర్ణ అభివృద్ధి
వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్ద ఘన నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు కిలివేటి సంజీవయ్య, నాయకులు

 ఎమ్మెల్యే కిలివేటి 

నాయుడుపేట, జనవరి 28 : రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటుతో  పరిపాలన సౌలభ్యం, సంపూర్ణ అభివృద్ధి సాధ్యమవుతాయని సూళ్లూరుపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు కిలివేటి సంజీవయ్య అన్నారు. నాయుడుపేటలో శుక్రవారం నాయకులు, కార్యకర్తలతో కలసి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలు రెట్టింపుకావడంతో ఆయా జిల్లాల్లో విస్తీర్ణం తగ్గడంతోపాటు ప్రత్యేకంగా కార్యాలయాలు ఏర్పాటై అధికారుల నియామకం జరిగి మంచి అభివృద్ధి, సంక్షేమానికి బాటలు పడతాయన్నారు.  కరోనాలోనూ ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ప్రతి నెల 1వ తేదీ ప్రభుత్వం జీతాలు వేసిందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర  ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులు సమన్వయం పాటించాల్సిన సమయం అన్నారు. కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్‌ తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కట్టా సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ ధనలక్ష్మి, నాయకులు కట్టా రమణారెడ్డి, కామిరెడ్డి రాజారెడ్డి, కలికి మాధవరెడ్డి, కటకం జయరామ్‌, జలదంకి వెంకటకృష్ణారెడ్డి, కిశోర్‌యాదవ్‌, పొట్లపూడి రాజేష్‌, చదలవాడ కుమార్‌, చెంచయ్య మొదలియార్‌, చంద్రారెడ్డి, దారా రవి, షబ్బిర్‌, అశోక్‌ నాగార్జున,  రత్నశ్రీ, రాహుల్‌ ఉన్నారు.

Updated Date - 2022-01-29T04:40:31+05:30 IST