Abn logo
Jun 15 2021 @ 01:43AM

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

గుండాల పోలీస్‌స్టేషన్‌లో మాట్లాడుతున్న వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ తురుణ్‌ జోషి

గుండాల, జూన్‌, 14:  పోలీసుస్టేషన్‌లో బాధితుల ఫిర్యాదులపై సిబ్బంది తక్షణమే స్పందించాలని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌ జోషి సూచించారు. గుండాల పోలీస్‌స్టేషన్‌ను  సోమవారం సాయంత్రం ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌లో నమోదయ్యే  కేసులతో పాటు నేరాల నియంత్రణకు  తీసుకుం టున్న చర్యలను ఎస్‌ఐని అడిగి తెలుసుకున్నారు. ప్రెండ్లీ పోలీసింగ్‌ను అమలు చేయాలని, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కమిషనర్‌ సూచించారు. ఆయన వెంట వెస్ట్‌ ్ట జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఘన్‌పూర్‌ ఏఎస్పీ అభినవ్‌ గైక్వాడ్‌, జనగామ రూరల్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌ ఉన్నారు.