ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-10-20T05:53:49+05:30 IST

ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు సూచించారు.

ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్‌

కలెక్టరేట్‌ (మహబూబ్‌నగర్‌) అక్టోబరు 19: ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు సూచించారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రజా వాణి వాట్సప్‌ వీడియో కాల్‌ ఫోన్‌ ద్వారా ప్రజల నుంచి 12 మంది ఫిర్యాదులను స్వీకరించా రు. వీటిలో భూములకు సంభంధించినవి కాగా మరి కొన్ని మునిసిపల్‌ ప్రాంతాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. పెండింగ్‌ లేకుం డా చూడాలని సంబంధిత అఽధికారులను ఆదేశించా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సీతారామారా వు, డీఆర్‌వో స్వర్ణలత, సర్వే ల్యాండ్‌ ఏడీ శ్యామ్‌ సుందర్‌ రెడ్డి పాల్గొన్నారు.


రాగల 24 గంటల్లో భారీ వర్షాలు

రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ, అతి భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన ట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధికారులు అప్రమత్తంగా ఉం డి రిజర్వాయర్లు, చెరువులు, నదులు, కాలువల్లోకి ఎవరూ వెళ్లకుండా చూడాలని ఆదేశించారు. ప్రమా ద సూచికలు ఏర్పాటు చేయాలని తెలిపారు. భారీ వర్షాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పు డు కలెక్టరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 08542-241165కు తెలియ జేయాలని కలెక్టర్‌ కోరారు.

Updated Date - 2020-10-20T05:53:49+05:30 IST