ప్రజావాణికి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-08-09T05:03:15+05:30 IST

ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులు పెండింగ్‌ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు.

ప్రజావాణికి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలి
ప్రజావాణిలో అర్జీలను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌

జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌

సిద్దిపేట అగ్రికల్చర్‌, ఆగస్టు 8: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులు పెండింగ్‌ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు.  సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా భూ సమస్యల పరిష్కారం, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, ఆసరా పింఛన్లు తదితర సమస్యలపై 61 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ఆయాశాఖలకు అందిన అర్జీలను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, డీఆర్డీవో గోపాల్‌రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పట్టా భూమిని సీలింగ్‌గా మార్చారు

మా తాత ముత్తాతల నుంచి సాగుచేస్తున్న పట్టా భూమిని ధరణిలో సీలింగ్‌గా మార్చారు. గతంలో నా భూమిపైన క్రాప్‌ లోన్‌ కూడా తీసుకున్నాను. నాకు రైతుబంధు, ఇతర సంక్షేమ పథకాలు ఏమి రావడం లేదు. రెండేళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ప్రజావాణిలో ఫిర్యాదు చేశాను. 

డబుల్‌ బెడ్‌రూం ఇవ్వలేదు

మేము వేసుకున్న గుడిసెలను తీసివేసి కులసంఘాలు, ఇతర ప్రభుత్వ ఆఫీసు నిర్మించారని, మాకు డబుల్‌ బెడ్‌రూం మంజూరు చేస్తామని అధికారులు హామీఇచ్చారు. కానీ ఇంతవరకు మంజూరు చేయలేదని గజ్వేల్‌లోని బుడగ జంగాల 15 కుటుంబాలు ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2022-08-09T05:03:15+05:30 IST