Abn logo
Mar 2 2021 @ 23:36PM

త్రిమూర్తి ఫర్నిచర్‌ సంస్థపై డీపీవోకు ఫిర్యాదు

నిజామాబాద్‌ రూరల్‌, మార్చి2: రూరల్‌ మండలం కేశాపూర్‌ గ్రామ పరిధిలో ఉన్న త్రిమూర్తి ఫర్నిచర్స్‌ (శ్రీ రేయాన్‌ పాలిమర్స్‌ సంస్థ) గ్రామ పంచాయతీకి పన్నులు చెల్లించకుండా ఇబ్బందులుపెడుతుందని జిల్లా పంచాయతీ అఽధికారి జయసుధకు సర్పంచ్‌ మల్లెల వసంత మంగళవారం లిఖితపూర్వక ఫిర్యాదుచేశారు. కేశాపూర్‌ గ్రామ పరిధిలో త్రిమూర్తి ఫర్నీచర్‌కు చెందిన శ్రీరేయాన్‌పాలిమర్స్‌, త్రిమూర్తి అగ్రిగోల్డ్‌ స్టోరేజ్‌ పేరుతో కర్మాగారం నిర్వహిస్తున్నారు. 2020-21కు సంబంధించి గ్రామపంచాయతీకి రూ.2,57,469 చెల్లించాల్సిన పన్ను చెల్లించడం లేదన్నారు. అనుమతులు లేకుండానే త్రిమూర్తి అగ్రిగోల్డు స్టోరేజ్‌ పేరుతో ఉన్నస్థలంలో నాలుగు అక్రమ నిర్మాణాలు చేపట్టారని మండిపడ్డారు.వాటికి చెల్లించాల్సిన రూ.1,41,364 చెల్లించడం లేదని ఫిర్యాదుచేశారు. ఇప్పటికే రెండు సార్లు డిమాండ్‌ నోటీసులు ఇచ్చినా వాటికి సైతం స్పందించడం లేదన్నారు. సదరుసంస్థపై తగు చర్యలు తీసుకుని గ్రామ పంచాయతీకి రావాల్సిన బకాయిలు చెల్లించేలా చూడాలని డీపీవోను కోరారు.


Advertisement
Advertisement