భార్య కనిపించడం లేదని ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-01-22T04:40:14+05:30 IST

న భార్య కనిపించడం లేదని మండలంలోని పెరియవట్టు పంచాయతీ బాలాజీకుప్పానికి చెందిన ఒక వ్యక్తి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

భార్య కనిపించడం లేదని ఫిర్యాదు

తడ, జనవరి 21 : తన భార్య కనిపించడం లేదని మండలంలోని పెరియవట్టు పంచాయతీ బాలాజీకుప్పానికి చెందిన ఒక వ్యక్తి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు  చేశాడు. పోలీసుల వివరాల మేరకు రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిన యువతి నందిని ఈ నెల 11న బాలాజీకుప్పంలోని ఇంటికి వచ్చింది. 12న తాను పుట్టింటికి వెళ్తానంటూ భర్తను అడిగితే ఆయన ఒప్పుకోలేదు. అతను బయటకెళ్లిన సమయలో ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి భర్త చుట్టుపక్కల, బంఽఽధువుల ఇళ్లల్లో వెతికినా కనబడలేదు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-01-22T04:40:14+05:30 IST