Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

చక్కెర ఫ్యాక్టరీ స్థలం ఆక్రమణపై ఫిర్యాదు

twitter-iconwatsapp-iconfb-icon
 చక్కెర ఫ్యాక్టరీ స్థలం ఆక్రమణపై ఫిర్యాదుఫ్యాక్టరీ స్ధలాన్ని పరిశీలిస్తున్న చక్కెర కర్మాగార ఎండీ సురేష్‌

 కోవూరు, జూలై 7: కోవూరు సహకార చక్కెర కర్మాగార స్థలాన్ని పలువురు రైతులు ఆక్రమించినట్లు ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఫిర్యాదు అందింది. ఫ్యాక్టరీ ఇన్‌ చార్జి మేనేజింగ్‌ డైరెక్టర్‌ సురేష్‌ గురువారం ఫ్యాక్టరీ ఆవరణను పరిశీలించారు. ఫ్యాక్టరీ  స్థలాన్ని రైతులు తమ పొలంలో కలుపుకోవడాన్ని పరిశీలించారు. పలువురు రైతులతో మాట్లాడి ఫ్యాక్టరీ స్థల ఆక్రమణల్ని తొలగించాలన్నారు. ఫ్యాక్టరీ స్థలాన్ని ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్రమించబోమని రైతులు హామీ ఇవ్వడంతో సమస్య పరిష్కారమైనట్లు భావిస్తున్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.