Jun 25 2021 @ 18:14PM

డైరెక్ట‌ర్ లింగుస్వామి స్పీడుకి బ్రేక్‌.. ఫిర్యాదు చేసిన నిర్మాత‌..!

ఒక‌ప్పుడు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన కోలీవుడ్ ద‌ర్శ‌కుడు ఎన్‌.లింగుస్వామికి ఈ మ‌ధ్య పెద్ద‌గా క‌లిసి రాలేదు. ఆయ‌న డైరెక్ట్ చేసిన చిత్రాలేవీ స‌క్సెస్ కాలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ ద‌ర్శ‌కుడు.. రీసెంట్‌గా హీరో రామ్‌తో సినిమాను ఓకే చేయించుకున్నాడు. తెలుగు, త‌మిళంలో రామ్ సినిమాను లింగుస్వామి తెర‌కెక్కిస్తాడ‌ని, త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంద‌ని లింగుస్వామి భావిస్తోన్న‌ త‌రుణంలో  ఓ నిర్మాత ఈ డైరెక్ట‌ర్ స్పీడుకి బ్రేకులేశాడ‌ట‌. ఆ నిర్మాత ఎవ‌రో కాదు...తెలుగు, త‌మిళంలో సినిమాలు చేసిన జ్ఞాన‌వేల్ రాజా. లింగుస్వామికి, త‌న‌కు మ‌ధ్య సినిమాల ప‌రంగా కొన్ని ఆర్థిక లావాదేవీలున్నాయ‌ని, ఆ లెక్కలు తేల్చే వ‌ర‌కు సినిమాలేవీ చేయ‌కుండా చూడాల‌ని చాంబ‌ర్‌లో ఫిర్యాదు చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వార్త‌ల‌పై లింగుస్వామి ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.