పంట కాలువ ఆక్రమణపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-05-29T11:46:19+05:30 IST

నడకుదురులో పంట కాలువ ఆక్రమణపై పలువురు గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

పంట కాలువ ఆక్రమణపై ఫిర్యాదు

కరప, మే 28: నడకుదురులో పంట కాలువ ఆక్రమణపై పలువురు గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. నడిమిలంక పంటకాలువ గట్టును ఆక్రమించి పలువురు శాశ్వత నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో రైతులు తమ పొలాల్లోకి రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తున్నారు.  చేసేదిలేక కొందరు రైతులు కాలువకు అవతలి గట్టును మిషన్‌తో చదునుచేసి రాకపోకలకు అనువుగా మార్చుకున్నారు. అయితే ఈ క్రమంలో కాలువను కొంతమేర పూడ్చివేయడంపై ఓ వర్గం రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపాధిహామీ పథకంలో చేసిన పని వృథా అయినట్టేనని ఆందోళన వ్యక్తంచేశారు. వీఆర్‌వో ఆదినారాయణ పంటకాలువను పరిశీలించారు. గట్టును సరిచేసే క్రమంలో కాలువలో పడిన మట్టిని అంతా తొలగించి సమస్య లేకుండా చేస్తామని మరో వర్గం రైతులు హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. అయితే గట్టుపై ఆక్రమణలను సర్వేచేసి తొలగించాలని రైతులు కోరారు. 

Updated Date - 2020-05-29T11:46:19+05:30 IST