EC Case: టీఆర్ఎస్ ఎంపీ పార్థసారధి రెడ్డిపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-07-27T20:22:07+05:30 IST

ఎంపీ పార్థసారధి రెడ్డిపై యాదాద్రి భువనగిరి జిల్లా వాసులు కేంద్ర ఎన్నికల సంఘంలో ఫిర్యాదు చేశారు.

EC Case: టీఆర్ఎస్ ఎంపీ పార్థసారధి రెడ్డిపై ఫిర్యాదు

ఢిల్లీ (Delhi): టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు పార్థసారధి రెడ్డి (Parthasaradhi Reddy)పై యాదాద్రి భువనగిరి జిల్లా వాసులు కేంద్ర ఎన్నికల సంఘంలో ఫిర్యాదు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌ (Affidavit)లో తనపై నమోదైన  క్రిమినల్ (Criminal) కేసులు, ఐటీ (IT) దాడులను పేర్కొనలేదని ఎన్నికల సంఘాని (EC)కి ఫిర్యాదు చేశారు. ఎంపీ పార్థసారధి రెడ్డిపై వేటు వేయాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.


హెజోల కంపెనీ (Hejola Company) వల్ల, యాదాద్రి (Yadadri) జిల్లాలోని అంతమ్మ గూడెంలో పార్థసారధి రెడ్డికి చెందిన ఫార్మా కంపెనీ (pharma company) వల్ల 15 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వాయు, కాలుష్యం, భూ కాలుష్యం వల్ల ప్రజలు జీవించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బాధితులు పేర్కొన్నారు.  దీనిపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (Pollution Control Board)కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వాపోయారు. 


ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ (National Green Tribunal)లో పిటిషన్ (Petition) దాఖలు చేశామని, విచారణ కొనసాగుతోందన్నారు. పార్థసారధి రెడ్డి అన్ని వ్యవస్థలను మేనేజ్ (Manage) చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. కిందస్థాయి నేతలను సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రి కేటీఆర్‌ (KTR)ను కలిసే పరిస్థితి లేదని పరిశ్రమల బాధిత సంఘం నేత నరేందర్ రెడ్డి (Narender Reddy) అన్నారు.

 

Updated Date - 2022-07-27T20:22:07+05:30 IST