వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు

ABN , First Publish Date - 2022-08-11T06:13:56+05:30 IST

విద్యుత్‌ వినియోగదారులు (సీజీఆర్‌ఎఫ్‌) ఫోరం ప్రస్తుతం వెబ్‌సైట్‌ను రూపొందించిందని, వినియోగదారులు వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదులు చేయొచ్చని ఫోరం చైర్మన్‌ దిలీప్‌కుమార్‌ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 78 ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. బుధవారం తూప్రాన్‌ విద్యుత్‌ డివిజన్‌ కార్యాలయంలో ఫోరం నిర్వహించారు.

వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు

తూప్రాన్‌, ఆగస్టు 10: విద్యుత్‌ వినియోగదారులు (సీజీఆర్‌ఎఫ్‌) ఫోరం ప్రస్తుతం వెబ్‌సైట్‌ను రూపొందించిందని, వినియోగదారులు వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదులు చేయొచ్చని ఫోరం చైర్మన్‌ దిలీప్‌కుమార్‌ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 78 ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. బుధవారం తూప్రాన్‌ విద్యుత్‌ డివిజన్‌ కార్యాలయంలో ఫోరం నిర్వహించారు. ఈ సందర్భంగా దిలీప్‌కుమార్‌ విలేకర్లతో మాట్లాడుతూ, 25 ఫిర్యాదులు పరిష్కరించబడి ఆదేశాలు కూడా జారీ చేశామన్నారు. 33 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, 20 ఫిర్యాలకు సంబంధించి అధికారులను నుంచి సమాచారం రావల్సి ఉందన్నారు. తూప్రాన్‌లో నిర్వహించిన ఫోరంలో మరో 10 దరఖాస్తులు వచ్చినట్లు దిలీప్‌రావు వివరించారు. విద్యుత్‌ వినియోగదారులు తమ సమస్యలు, ఇబ్బందులు, కనెక్షన్ల పొందడంలో ఆలస్యంఫై ఫిర్యాదులు చేయవచ్చాన్నారు. 

Updated Date - 2022-08-11T06:13:56+05:30 IST