విద్యార్థినులపై వేధింపుల నియంత్రణకు ఫిర్యాదుల పెట్టె

ABN , First Publish Date - 2022-08-07T06:59:46+05:30 IST

విద్యార్థినులపై వేధింపుల నియంత్రణకు ఫిర్యాదుల పెట్టె

విద్యార్థినులపై వేధింపుల నియంత్రణకు ఫిర్యాదుల పెట్టె
వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న అధికారులు

 అందులో ఫిర్యాదు వేస్తే పదిహేను రోజుల్లో సమస్యకు పరిష్కారం: పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌

పెనమలూరు, ఆగస్టు 6: విద్యార్థినులపై వేధింపుల నియంత్రణకు చైల్డ్‌లైన్‌ హెల్ప్‌లైన్‌, టోల్‌ఫ్రీ నంబర్లతో ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న ఫిర్యాదుల పెట్టెను, వాల్‌పోస్టర్లను లైఫ్‌లైన్లుగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ పిలుపునిచ్చారు. ఫిర్యాదుల పెట్టెలో వేసే ఎటు వంటి సమస్యకైనా పదిహేను రోజులలో పరిష్కారం లభించేలా మండల కమిటీ వేశా మని ఆయన తెలిపారు. పెనమలూరు జడ్పీ హైస్కూల్‌లో బాలికలపై వేధింపులు ఆపాలి పేరుతో అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఫిర్యాదుల పెట్టెను ప్రారంభించారు. దిశ యాప్‌, పోక్సో చట్టంపై ప్రతి మహిళ, విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలని, రాష్ట్రంలో ఏ విద్యార్థినీ మానసిక, శారీరక వేధింపులకు గురి కాకూ డదని, ఫిర్యాదుల పెట్టె ద్వారా సమస్యలను తెలియజేసి, పరిష్కారం పొందాలని పాఠశాల విద్యాశాఖ కమిషనరు ఎస్‌.సురేష్‌కుమార్‌ సూచించారు. పెనమలూరు హై స్కూల్‌, విజయవాడ స్టెల్లా కాలేజి విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ బి.ప్రతాపరెడ్డి, కృష్ణాజిల్లా విద్యా శాఖాధికారి తాహెరా సుల్తానా, సమగ్ర శిక్షా జిల్లా అదనపు కో-ఆర్డి నేటరు శేఖర్‌, తహ సీల్దార్‌ భద్రు, ఎంపీడీవో సునీతాశర్మ, ఎంఈవో కనకమహాలక్ష్మి, హెచ్‌ఎం దుర్గాభవాని, సర్పంచ్‌ లింగాల భాస్కరరావు, రమేష్‌, ప్రకాష్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-08-07T06:59:46+05:30 IST