డీటీవో డీడీపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-05-06T04:31:47+05:30 IST

ఆదిలాబాద్‌ డీటీవో కార్యాలయ డి ప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసిన యు.నాగరాజుపై ఆ శాఖ ఉద్యోగులు బుధవారం టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తమను వేధింపులకు గురి చేయడంతో పాటు మానసిక క్షోభకు గురి చేస్తున్నారని అన్నారు. గతంలో ఆదిలాబాద్‌ జిల్లా డీటీవో డీడీగా పని చేసిన నాగరాజు ప్రస్థుతం కరీంనగర్‌కు బదిలీపై వెళ్లారని అన్నా రు. అయితే నాగరాజు వ్యక్తిగతంగా ఫోన్‌ చేసి బదిలీపై వెళ్తున్న తాను తిరిగి డీడీగా ఆదిలాబాద్‌కే వస్తున్నానని, ఆ తర్వా త అందరి సంగతి చూస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

డీటీవో డీడీపై ఫిర్యాదు
పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న ఉద్యోగులు

ఆదిలాబాద్‌టౌన్‌, మే5: ఆదిలాబాద్‌ డీటీవో కార్యాలయ డి ప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసిన యు.నాగరాజుపై ఆ శాఖ ఉద్యోగులు బుధవారం టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తమను వేధింపులకు గురి చేయడంతో పాటు మానసిక క్షోభకు గురి చేస్తున్నారని అన్నారు. గతంలో ఆదిలాబాద్‌ జిల్లా డీటీవో డీడీగా పని చేసిన నాగరాజు ప్రస్థుతం కరీంనగర్‌కు బదిలీపై వెళ్లారని అన్నా రు. అయితే నాగరాజు వ్యక్తిగతంగా ఫోన్‌ చేసి బదిలీపై వెళ్తున్న తాను తిరిగి డీడీగా ఆదిలాబాద్‌కే వస్తున్నానని, ఆ తర్వా త అందరి సంగతి చూస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనకు తిరిగి డీడీగా వచ్చేందుకు మద్దతు ఇవ్వాలని, లేకపోతే పోలీసుస్టేషన్‌లో కేసులు పెట్టించి జై లుకు పంపిస్తానంటూ మానసికంగా వేధిస్తున్నారన్నారు. ప్ర స్తుతం కరీంనగర్‌ జిల్లాకు బదిలీపై వెళ్తున్న యు.నాగరాజు వల్ల తమకు ప్రాణహాని ఉందని, అందుకు ఎవరికీ ఏం జరిగిన నాగరాజు బాధ్యుడని తెలిపారు. అతడిపై కేసు నమోదు చేయాలని కోరారు. వేధింపుల సెక్షన్‌, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కే సు పెట్టాలన్నారు. ఇదిలా ఉంటే సదరు ఉద్యోగులు ఆరోపణల పై బదిలీపై వెళ్తున్న డీడీ నాగరాజు మాట్లాడుతూ.. ఆదిలాబాద్‌ జిల్లా డీటీవో డీడీగా చేసిన తాను విధుల పట్ల బాధ్యతగా పనిచేయాలని, కఠినంగా వ్యవహరించడంతో పాటు విధుల పరంగా వారు చేస్తున్న కొన్నిలోసుగులను బయట పెట్టినందు కు ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. కరీంనగర్‌కు బదిలీపై వెళ్లిన తాను తిరిగి ఆదిలాబాద్‌కు వచ్చే ఆలోచన లేదని అన్నారు.

Updated Date - 2021-05-06T04:31:47+05:30 IST